తెలంగాణ

telangana

కేంద్రంలోని పెద్దల పర్యవేక్షణలోనే.. బండి సంజయ్ కుట్రలు: సబితా

By

Published : Apr 5, 2023, 8:31 PM IST

Minister Sabitha Indra Reddy on Bandi Arrest: పదో తరగతి పరీక్షల్లో సిబ్బంది ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే బండి సంజయ్ కుట్రలకు తెరతీశారని ఆమె ఆరోపించారు.

Minister Sabitha Indra Reddy on Bandi Arrest
Minister Sabitha Indra Reddy on Bandi Arrest

కేంద్రంలోని పెద్దల పర్యవేక్షణలోనే.. బండి సంజయ్ కుట్రలు: సబితా

Minister Sabitha Indra Reddy on Bandi Arrest: పదో తరగతి పేపర్ల లీకేజీ ఘటనలో కుట్ర కోణం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఈ ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఎంతటి వారున్నా ఉపేంక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే.. ఈ కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ పెద్దల సూచనతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కుట్రలకు తెరతీశారని విమర్శించారు. స్వార్ధ పూరిత రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటల అని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షల్లో సిబ్బంది ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.

బాధ్యత లేకుండా, బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో.. రాజకీయ కుట్రలో భాగంగా ఈ రెండు ఘటనలు జరిగాయి. ఏం జరిగిందని అది కూడా వదిలేసి రాజకీయంగా పిల్లల భవిష్యత్​తో ఆడుకుంటున్న మీరు తల వంచుకోవాలి. అది వదిలేసి తప్పు చేసినా కూడా తల ఎగరేసి జెండా పట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. పదోతరగతి పరీక్షలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

మరోవైపు రాష్ట్రంలో బండి అరెస్టుపై బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఆయనను ఎందుకు సంజయ్​ని అరెస్టు చేశారో చెప్పాలంటూ పోలీసులను నిలదీశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. స్వార్ధ రాజకీయాల కోసం బీజేపీ నాయకులు.. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆరోపించారు. 'పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం' అని మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీవి దిగజారుడు రాజకీయాలని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. పదో తరగతి పిల్లలతో ఈ రాజకీయాలేంటని ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆటలాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసి పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్న ఆయన.. అధికారం కోసం ఏదైనా చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details