తెలంగాణ

telangana

CWC Meeting Hyderabad 2023 : హైదరాబాద్‌లో ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 2:28 PM IST

Updated : Sep 17, 2023, 3:17 PM IST

CWC Meeting 2023
CWC Meeting Hyderabad 2023

14:25 September 17

CWC Meeting Hyderabad 2023 : హైదరాబాద్‌లో ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు

CWC Meeting Hyderabad 2023 :'భారత్ జుడేగా.. ఇండియా జీతేగా' అనే నినాదంతో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల వివరాలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌(ట్విటర్) వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ ముందున్న సవాళ్ల గురించి తాము అవగాహన కలిగి ఉన్నామని ఖర్గే(AICC Chief Mallikarjun Kharge) తెలిపారు. ఈ సవాళ్లు కేవలం కాంగ్రెస్ పార్టీవి మాత్రమే కాదని.. యావత్ భారతదేశానివని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం జరుగుతోందని వెల్లడించారు.

CWC Meeting Hyderabad Details 2023 : 'ఐదు రాష్ట్రాల్లో 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు సామాజిక న్యాయం, సంక్షేమానికి మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి. ఇది విశ్రమించాల్సిన సమయం కాదని గుర్తించాలి. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజల సమస్యలు మరింత పెరిగాయి. పేద ప్రజల సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది.' అని ఖర్గే తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

"ఇది విశ్రమించాల్సిన సమయం కాదు. గత పదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రజల సమస్యలు రెండింతలయ్యాయి. ప్రధాని మోదీ.. దేశంలో పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. ఆ సమస్యలకు పరిష్కారం చూపించడంలో మోదీ సర్కార్ విఫలమైంది. ఇలాంటి క్లిష్టసమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుంది. మనమంతా కలిసి మోదీ సర్కార్‌ను గద్దెదించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి."- మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

Anti Congress Posters Hyderabad : కరప్ట్‌ కాంగ్రెస్‌ మోడల్‌.. కరెక్ట్ బీఆర్‌ఎస్‌ మోడల్‌.. హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం

Kharge on CWC Meeting Details :మోదీ సర్కార్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలు భావిస్తున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో తమ పార్టీ విజయమే దీనికి రుజువు అని చెప్పారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తూ.. వ్యక్తిగత ఆసక్తిని పక్కనబెట్టి.. అభిప్రాయభేదాలను పక్కనబెట్టి అందరం కలిసికట్టుగా ప్రజల కోసం పని చేయాలని సీడబ్ల్యూసీ(CWC Meeting 2023) సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిపారు. ఐకమత్యంతో మాత్రమే మోదీని గద్దె దించగలమని.. ప్రజాసమస్యలను పరిష్కరించగలమని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ ఐకమత్యమే తమను అధికారంలోకి తీసుకువచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ ఎన్నికై 2024 సంవత్సరానికి 100 ఏళ్లు పూర్తవుతుంది.. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించడమే గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఘన నివాళి అవుతుందని ఖర్గే తెలిపారు.

Congress Vijayabheri Sabha 2023 :సీడబ్ల్యూసీ సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన అజెండాపై చర్చించినట్లు ఖర్గే తెలిపారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ భేటీలో సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు మండలి నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం తుక్కుగూడలో 10లక్షల మందితో నిర్వహించే విజయభేరి బహిరంగ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్యనేతలు హాజరవనున్నారు. బహిరంగ సభలో కాంగ్రెస్ గ్యారెంటీ పత్రాలను సోనియాగాంధీ విడుదల చేస్తారు. బహిరంగ సభ అనంతరం రాత్రికి 119 నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లి సోమవారం రోజున సమావేశాలు నిర్వహిస్తారు.

Congress Vijayabheri Sabha Today : తుక్కుగూడ వేదికగా.. నేడు కాంగ్రెస్‌ ఎన్నికల సమర శంఖం

CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశాలు

Last Updated : Sep 17, 2023, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details