ETV Bharat / state

CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 3:33 PM IST

Updated : Sep 16, 2023, 10:28 PM IST

CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్​ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హోటల్ తాజ్​కృష్ణలో జరుగుతున్న సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.

CWC Meeting
CWC Meeting Started at Hyderabad

CWC Meeting హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశాలు

CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్​ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశాలు ప్రారంభమయ్యాయి. హోటల్ తాజ్​కృష్ణలో జరుగుతున్న సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ హాజరయ్యారు. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. తాజ్​కృష్ణ ప్రాంగణంలో భారత్​ జోడో యాత్ర(Bharat Jodo Yatra) చిత్రాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు హైదరాబాద్​కు వచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్ర నేతల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీ భధ్రతను ఏర్పాటు చేశారు. సీఆర్​పీఎఫ్ పోలీసులతో పాటు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు.

CWC Meeting at Hyderabad : మధ్యాహ్నం సమయంలో విమానాశ్రయానికి చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు కేసీ వేణుగోపాల్, ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, వీహెచ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు పూలబొకేలు అందించి స్వాగతం పలికారు. అంతకు ముందు ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బగెల్, కర్ణాటక సీఎం సిద్ధారామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ, మాజీ కేంద్ర మంత్రి చిదంబరంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశాలను ప్రారంభించారు.

CWC Meeting in Hyderabad Today : హైదరాబాద్‌లో ఇవాళ, రేపు కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు

CWC Meeting in Telangana : సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన ఖర్గే.. దేశంలో తక్షణం కులగణనతో కూడిన జనాభా లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా అణచివేతకు గురైన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఇండియాకూటమిలో 27పార్టీలు ప్రాథమికమైన అంశాల్లో కలిసిసాగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మూడు సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వ.. ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఇండియా కూటమి సమావేశాలతో కలవరపడుతున్న బీజేపీ.. ప్రతిపక్షాలపై ప్రతీకార చర్యలకు దిగుతోందని ఖర్గే ఆరోపించారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించామన్న చిదంబరం.. రాష్ట్రాల హక్కుల్ని బీజేపీ హరించేస్తోందని ఆరోపించారు.

Congress Working Committee Meeting : పార్లమెంటులో ప్రజాభిప్రాయం ప్రతిబింబించకుండా ప్రతిపక్షాలపై కేంద్రం చేపడుతున్న అణచివేత చర్యల్ని ఖండిస్తున్నట్లు ఖర్గే తెలిపారు. రానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాపై అధికార పార్టీ ఉద్దేశాలపై ఆందోళన నెలకొందని తెలిపారు. దేశం అనేక అంతర్గత సవాళ్ల కూడలిలో ఉందన్న ఖర్గే.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపుర కలహాలు, అసమానతలు నియంత్రణలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మణిపురలో ఇప్పటికీ ఆగని విషాద ఘటనలను దేశం యావత్తూ గమనిస్తోందని తెలిపారు. ఈ అల్లర్లు హరియాణలోని నూహ్​కు విస్తరించేలా మోదీ సర్కార్ చేసిందని ఆరోపించారు.

Tummala Join Congress : మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల

Pawan Khera Fires on BRS Government : తెలంగాణలో అన్నీ పెద్ద పెద్ద కుంభకోణాలే: పవన్‌ ఖేరా

Last Updated : Sep 16, 2023, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.