తెలంగాణ

telangana

Contract Employees Letters to Ministers : మా 411 మందిని క్రమబద్ధీకరించండి.. 9 ఏళ్లుగా కాంట్రాక్ట్ అధ్యాపకుల పోరాటం

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 8:19 PM IST

Contract JL Employees Letters to Ministers : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తమ కష్టాలు తీరిపోతాయనుకున్నారు. అప్పటి టీఆర్​ఎస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తమ కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తుందని భావించారు. అయితే పోస్టులు లేవంటూ ఆ 411 మంది వృత్తి విద్యా అధ్యాపకులను పక్కన పెట్టడంతో.. వారు న్యాయం చేయాలంటూ 9 ఏళ్లుగా పోరాడుతున్నారు. కనిపించిన మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Contract JL Employees Letters to Ministers
Contract Employees Letters to Ministers

Contract JL Employees Letters to Government :తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మొదటిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా.. కాంట్రాక్టు ఉద్యోగులను(Contract Employees) రెగ్యులరైజ్ చేసేందుకు సీఎం కేసీఆర్​ సర్కారు 26 ఫిబ్రవరి 2016న జీఓ నెంబర్ 16ను తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో 1,1600 మంది రెగ్యులరైజేషన్​కు అసెంబ్లీ ఆమోదించింది.

CM KCR: కొత్త సచివాలయ ప్రారంభ వేళ.. ఒప్పంద ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు

కానీ, 30 ఏప్రిల్ 2023న తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా 5,500 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తూ జీఓ నెంబర్ 38ని విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ లో పనిచేస్తున్న 3,550 మందికిగాను 3,093(జనరల్, ఒకేషనల్ విభాగంలో కలిపి) మందిని మాత్రమే క్రమబద్ధీకరించడానికి అనుమతిచ్చింది. అయితే అన్ని రకాల విద్యా అర్హతలు కలిగి ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న 411 మంది కాంట్రాక్టు అధ్యాపకులను పోస్టులు లేవనే కారణంతో రెగ్యులరైజేషన్ లిస్టులో కలపకుండా వదిలివేశారని వారు వాపోతున్నారు.

Contract 411 Employees Letters to Government :వాస్తవానికి పోస్టులను అవసరానికి అనుగుణంగా కన్వర్షన్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. అధికారులు అలా చేయలేక, పోస్టులు లేవని సమాధానం చెబుతున్నారు. తమకు ఉద్యోగాలు రెగ్యులర్ కాకపోవడం వలన సమాజంలో.. తోటి అధ్యాపకుల నుంచి ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంటూ మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని కాంట్రాక్ట్ ఒకేషనల్ అధ్యాపకులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.

Contract JL Employees Letters to Ministers

Contract Teachers Letters to Ministers : తమకు న్యాయం చేయాలంటూ రోజుకొక నేతను కలుస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సెప్టెంబర్ 7న, ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డిని 13న, మంత్రి టి.హరీష్ రావును 14న కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ను సెప్టెంబర్ 15, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు ఇదే నెల 16న మళ్లీ కలిసి వారి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు.

సెప్టెంబర్ 29వ యాదాద్రి పర్యటనకు వచ్చిన మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావుకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యాపకులు వినతి పత్రం అందజేశారు. తమలో మిగిలిన 411 మందిని క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని వారు కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో.. తాము రెగ్యులర్ అవుతామా? లేదా? అనే అయోమయంలో కాంట్రాక్ట్ ఒకేషనల్ అధ్యాపకులు ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని రెగ్యులరైజ్ చేయాలని 411 మంది అధ్యాపకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Part Time Contract Teachers Protest in Hyderabad : తమను క్రమబద్ధీకరించాలంటూ ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు నిరసన

Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?'

ABOUT THE AUTHOR

...view details