తెలంగాణ

telangana

Congress VS BRS on Praja Garjana Meeting : ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌పై బీఆర్​ఎస్​ నాయకుల విమర్శలు.. తిప్పికొట్టిన కాంగ్రెస్​ నాయకులు

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 9:22 PM IST

Congress VS BRS on Praja Garjana Meeting : చేవెళ్ల ప్రజాగర్జన సభలో హస్తం పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనా తీరే ఎస్సీ, ఎస్టీల వెనకబాటు తనానికి కారణమని అధికార పార్టీ ఆరోపించింది. దళిత సీఎం సహా కేసీఆర్​ ఎస్సీలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని హస్తం నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌పై మంత్రులు కేటీఆర్, హరీశ్‌, ఎమ్మెల్సీ కవిత, ఇతర నేతలు విమర్శలు గుప్పించగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు తిప్పికొట్టారు.

Congress Leaders Respond on BRS Comments
BRS Leaders Comments on Congress SC ST Declaration

BRS VS CONGRESS Party తెలంగాణలో రాజకీయ వేడీ

Congress VS BRS on Praja Garjana Meeting: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాన పార్టీల విమర్శలు- ప్రతివిమర్శలతో రాజకీయ వేడి రాజుకుంటోంది. మూడ్నెళ్ల ముందుగానే అధికార బీఆర్​ఎస్​ తమ అభ్యర్థులను ప్రకటించగా.. అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ సైతం ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేసింది. చేవెళ్లలో ప్రజాగర్జన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ప్రకటించిన ఎస్సీ, ఎస్సీ డిక్లరేషన్‌పై గులాబీ దళం విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ది డిక్లరేషన్ సభకాదు.. అధికారం రానే రాదనే ఫ్రస్ట్రేషన్ సభని మంత్రి కేటీఆర్​ ట్విటర్‌ వేదికగా విమర్శించగా.. ఇందుకు కొనసాగింపుగా మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, పార్టీ నేతలు కాంగ్రెస్‌ తీర్మానంపై వాగ్బాణాలు సంధించారు.

"దేశంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్​ పార్టీ. దళితులను దారిద్య్రరేఖకు దిగువగా ఉంచారు. బీఆర్​ఎస్​ దళిత బంధు రూ.10 లక్షలు ఇస్తామంటే.. కాంగ్రెస్​ రూ.12 లక్షలు ఇస్తారని చెబుతున్నారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కాంగ్రెస్​ నాయకులకు లేదు."- కవిత, ఎమ్మెల్సీ

BRS Leaders Criticise Congress Party : 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు ఎస్సీల సంక్షేమం గుర్తుకు రాలేదా అని కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. దళిత, గిరిజనుల వెనకబాటు తనానికి కాంగ్రెస్సే కారణమని కవిత ఆరోపించారు. హస్తం పార్టీవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్‌లుగా మంత్రి హరీశ్‌రావుఅభివర్ణించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిలపడ్డ కాంగ్రెస్‌.. రాష్ట్రంలో అధికారంలోకి ఎలాగూ వచ్చిది లేదనే ఇష్టానుసారంగా తీర్మానాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. దళిత, గిరిజనుల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ తెలిపారు. డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రతీ అంశాన్ని అమలుచేసి తీరుతామన్నారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే వారికిచ్చిన హామీ మేరకు వెంటనే దళిత ముఖ్యమంత్రిని చేయగలరా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. మూడెకరాల భూమి, దళిత సీఎంతో పాటు అనేక హామీలిచ్చి.. అడుగడుగునా కేసీఆర్‌ వారిని మోసం చేశారని షబ్బీర్‌ అలీ ఆరోపించారు.

BRS Leaders Respond on Congress SC ST declaration : కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​పై.. బీఆర్ఎస్ నేతల ఫైర్

Revanth Reddy Reaction on BRS Leaders Comments: కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై బీఆర్​ఎస్​ విమర్శలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తిప్పికొట్టారు. తమ డిక్లరేషన్ దళిత- గిరిజనుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకేనన్న ఆయన.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన విధంగా వారిని అవమానించేందుకు కాదన్నారు. ట్విటర్​ వేదికగా పది అంశాలను ప్రస్తావిస్తూ.. అధికార పార్టీ తీరును రేవంత్‌రెడ్డి ఎండగట్టారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, 12శాతం రిజర్వేషన్లు అంటూ మోసం చేసినట్లుగా తమ డిక్లరేషన్‌ ఉండదన్నారు. గిరిజన రైతులకు బేడీలు, నేరెళ్ల ఘటనలను ప్రస్తావించిన పీసీసీ అధ్యక్షుడు.. కాంగ్రెస్ పేదలకు పంచిన భూములను లాక్కుని రియల్‌ మాఫియాకు అప్పగించినట్లుగా తమ డిక్లరేషన్‌ ఉండదన్నారు.

Harish Rao Latest Comments : వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 సీట్లు గెలుస్తుంది: హరీశ్​రావు

BRS Congress Debate on SC ST Declaration : ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్​పై రగడ.. ఆగని అధికార, విపక్షాల గలాట

Revant Reddy on SC ST Declaration : 'అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తాం'

ABOUT THE AUTHOR

...view details