Harish Rao Comments on Congress Party : 'కాంగ్రెస్‌ ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడితే అది మొసలి ప్రేమే'

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 5:37 PM IST

thumbnail

Harish Rao Comments on Congress Party and Jagjeevan Ram : గిరిజనుల వెనుకబాటుకు కారణం కాంగ్రెస్​ పార్టీనేనని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. బీఆర్​ అంబేద్కర్​ను ఓడించిన పార్టీ కాంగ్రెస్​ అని.. అతను చనిపోయాక భారతరత్న ఇవ్వలేదని విమర్శించారు. అలానే జగ్జీవన్‌రామ్‌ ప్రధాని కాకుండా రాజకీయాలను చేసిందని.. కాంగ్రెస్‌ ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడితే అది మొసలి ప్రేమేనని అగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్​ ఉత్త కరెంటు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్(Congress)​ మళ్లీ అధికారంలోకి వస్తే ఎరువులు, విద్యుత్​ కోతలు ఉంటాయని మండిపడ్డారు. గిరిజనుల కోసం తండాలను పంచాయతీలుగా మార్చారని తెలిపారు. వారి కోసం పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్​ నాయకత్వంలోని రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్​ వస్తోందని వివరించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో పాలమూరు జిల్లా పచ్చని కొంగు కప్పుకున్నట్లు రూపుదిద్దుకోందని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం శ్రీరామరక్షలాగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ మూడోసారి బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొంత మంది నాయకులు హరీశ్​రావు సమక్షంలో బీఆర్​ఎస్​ కండువా కప్పుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.