తెలంగాణ

telangana

Telangana Congress Leaders Delhi Tour : T-కాంగ్రెస్​ నేతలకు హైకమాండ్‌ నుంచి పిలుపు

By

Published : Jun 24, 2023, 6:10 PM IST

Updated : Jun 24, 2023, 8:01 PM IST

Telangana Congress Leaders to Meet Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్​ నేతలకు దిల్లీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆదివారం సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు దిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఆ పార్టీ అగ్ర నాయకులు రాహుల్​ గాంధీతో పొంగులేటి, జూపల్లి కృష్ణారావు భేటీ కానున్నారు. హస్తం నేతలకు అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడం రాష్ట్ర కాంగ్రెస్​లో చర్చనీయాంశమైంది.

Telangana Congress
Telangana Congress

Telangana Congress Leaders Delhi Tour : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసుల రెడ్డిలు సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం 11గంటలకు దిల్లీలో సమావేశం అయ్యేందుకు ముహుర్తం ఖరారైనట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్​ రావ్‌ ఠాక్రే దిల్లీ వెళ్లనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాత్రం ఆదివారం గానీ.. సోమవారం ఉదయం దిల్లీ వెళ్లనున్నారు.

జూపల్లి, పొంగులేటిలకు చెందిన అనుచరగణం దాదాపు యాభై మంది ఉన్నట్లు పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ప్రతి నియోజక వర్గం నుంచి ముగ్గురు నుంచి అయిదుగురు లెక్కన దాదాపు 40 మంది వరకు ముఖ్యులతో తాను దిల్లీ వెళ్తున్నట్లు వివరించారు. అయితే జూపల్లి కృష్ణారావుతోపాటు మరో పది మంది దిల్లీ వస్తారని పేర్కొన్నారు. మొదట రాహుల్‌ గాంధీతో సమావేశం తరువాత ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో వరుసుగా సమావేశం అవుతారు. వీరందరిని కలిసిన తరువాత సమయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలో చేరికపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Ponguleti Srinivas Reddy joined Congress : ఏది ఏమైనా పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఊపొచ్చింది. అప్పటి వరకు నేతల మధ్య విభేదాలు, పార్టీలో జూనియర్లు, సీనియర్లు అంటూ వ్యత్యాసం చూపించిన నేతలు.. కన్నడ ఫలితాలతో ఒక్కతాటి మీదకు వచ్చారు. అందరూ కలిసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చక్రం తిప్పుతున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రేవంత్​ రెడ్డి మధ్య చాలా విభేదాలు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగింది. కానీ నల్గొండ మీటింగ్​లోనూ.. పొంగులేటి, జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించడానికి వీరు ఇరువురు కలిసి వెళ్లడంతో ఆ వార్తలకు చెక్​ పడింది. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని అందరం కలిసి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని సీనియర్లు సైతం ప్రకటనలు విడుదల చేశారు.

ఆదివారం జరిగే పార్టీ అధిష్ఠాన భేటీలో కొద్ది నెలల్లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో రాష్ట్ర నాయకులు సమావేశంలో పాల్గొంటారు. కర్ణాటక ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని కొనసాగించే వ్యూహాలపై అధిష్ఠానం రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది

ఇవీ చదవండి:

Last Updated : Jun 24, 2023, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details