ETV Bharat / state

Bandi Sanjay On Congress And BRS : 'కాంగ్రెస్‌ నాయకులు గాలిలో కోటలు నిర్మిస్తున్నారు'

author img

By

Published : Jun 18, 2023, 6:42 PM IST

BANDI SANJAY
BANDI SANJAY

Bandi Sanjay Tweet Today : రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పగటి కలలు కంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు​. గాలిలో కోటలు కట్టడం తప్ప ఈ నేతలకు ఏం తెలుసని మండిపడ్డారు. మరోవైపు​ వచ్చే శాసనసభ ఎన్నికలో అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అందవని.. కేసీఆర్​ ప్రజల్లో అశాంతిని సృష్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay fire on Congress And BRS : తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలు, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందిన విషయాన్ని మరచిపోయి కాంగ్రెస్​.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. ఇలాంటి క్రైమ్​, కరప్షన్​ టీపీసీసీ కళంకిత రాజకీయ నాయకులే గాలిలో కోటలు నిర్మిస్తారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Bandi Sanjay Tweet Today : కర్ణాటకలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే.. ఏమి జరుగుతుందో ట్రైలర్​లో కనిపిస్తోందని బండి సంజయ్​ ఆరోపించారు. అక్కడి పాలకులు హిందువులపై మతమార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కర్ణాటక పాఠ్యపుస్తకాల్లో హెడ్గేవార్​, సావర్కర్​ చరిత్రలను తీసేసి.. ఒసామా బిన్​ లాడెన్​, కసబ్​ లాంటి ఉగ్రవాదులపై చాప్టర్​లు చెబుతారా ఏంటని ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో బియ్యం పంపిణీ పథకం చాలా లోపభూయిష్ఠంగా జరుగుతోందన్నారు. అదానీ వద్దని చెప్పిన రాహుల్​గాంధీనే.. కర్ణాటకలో పెట్టుబడులకు పెట్టేందుకు అదానీని ఆహ్వానించారని బండి సంజయ్ తెలిపారు.

Bandi Sanjay Tweet On KCR : రాష్ట్రంలో పింఛన్లు, ధరణి, సంక్షేమ పథకాలపై అనిశ్చితి ఏర్పడిందని బండి సంజయ్​ ట్విటర్​లో ఆరోపించారు. ఇదికాక మరోవైపు కాంగ్రెస్​ ఈ విషయాలపై అనిశ్చితిని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మరోవైపు​ వచ్చే శాసనసభ ఎన్నికలో అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అందవని.. స్వయంగా బీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజల్లో అశాంతిని సృష్టిస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.

సామాజిక భద్రత పథకాలను కొనసాగిస్తాం : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. సామాజిక భద్రత పథకాలను కొనసాగిస్తామని బండి సంజయ్ తెలిపారు. తమ పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి పౌరుల సంక్షేమమే ప్రధానమని.. భారతదేశం సంక్షేమం రాజ్యమని చెప్పారు. అన్ని లోపాలను సరిదిద్ది, రాజకీయ నాయకులు వారి కుటుంబాలకు కాకుండా.. ప్రజలకు మాత్రమే ఉపయోగపడేలా వాటిని మరింత మెరుగుపరుస్తామని బండి సంజయ్​ వెల్లడించారు.

"తెలంగాణ ఉపఎన్నికలు, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఘోర పరాజయాన్ని చూసింది. క్రైమ్​, కరప్షన్​ టీపీసీసీ కళంకిత మాటలు ఆడే వారే గాలిలో కోటలు కడతారు. కర్ణాటకలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఏం జరిగిందో ట్రైలర్​లోనే కనిపించింది. సావర్కర్​ చరిత్రలను పాఠ్యపుస్తకాల్లోంచి తీసేసి.. బిన్​ లాడెన్​ చరిత్రను పెడతారా? రాష్ట్రంలో పింఛన్లు, ధరణి, సంక్షేమ పథకాలపై అనిశ్చితి ఏర్పడింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సామాజిక భద్రత పథకాలను కొనసాగిస్తాం." - బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

  • Congress leaders are day dreaming of forming government conveniently forgetting that they lost horribly in By-elections and GHMC elections in Telangana.

    Tainted Politicians of Crime & Corruption (TPCC) are building castles in the air.

    A trailer of what happens if Congress…

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.