తెలంగాణ

telangana

Congress Focus On Six Guarantees : ఆరు గ్యారంటీలు.. ప్రజలకి చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న కాంగ్రెస్​

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 5:21 PM IST

Congress Focus On Six Guarantees in Telangana : కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ సోనియాగాంధీ విజయభేరి సభలో ప్రకటించిన హామీలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఆరు గ్యారంటీలపై పల్లెల్లో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజలకు తెలిసే విధంగా వివిధ కార్యక్రమాలు.. పార్టీ నాయకులు పాల్గొని ప్రజలకి వివరించే విధంగా సన్నద్ధం అవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Telangana Assembly Elections 2023
Congress Focus on Six Guarantee to Villagers in Telangana

Congress Focus On Six Guarantee in Telangana: శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తోంది. యువ డిక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్‌, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌, చేయూత కింద రూ.4000 పెన్షన్‌ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్‌ తాజాగా ఆరు గ్యారంటీలను కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్​ సోనియాగాంధీ తుక్కుగూడ సభలో ప్రకటించారు. కర్ణాటకలో అయిదు హామీల గ్యారంటీ కార్డు ప్రకటించడంతో.. అక్కడి ఎన్నికల్లో ఆ హామీలు తీవ్ర ప్రభావితం చూపినందున గెలిచిందని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

Congress Ready to campaign on SixGuarantee: రాష్ట్రంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అంతకంటే ఎక్కువ ప్రభావితం చేసేవిగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో మాదిరి తెలంగాణాలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్‌(Congress Party) స్పష్టం చేస్తోంది. ఇప్పటికే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాలల్లో ఏఐసీసీ నిర్దేశించిన ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు ఈ ఆరు గ్యారంటీలపై కార్యక్రమాలు నిర్వహించి ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

Congress Six Guarantee in Telangana: ప్రధానంగా మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెలా రూ.2500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌.. ఈ మూడు హామీలు మహిళా ఓటర్లను తీవ్ర ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తోంది. యువ వికాసం పేరున.. విద్యార్ధులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు పథకాలు యువతపై ప్రభావం చూపుతాయని పీసీసీ భావిస్తోంది. ఇక రైతు భరోసా(Rythu Bharosa) కింద.. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే కూలీలకు ప్రతి ఏటా రూ.12,000, వరి పంట పండించే రైతులకు.. మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్‌ కింద కలిపి చెల్లిస్తారు. ఇవి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతులను, రైతుపై ఆదారపడి జీవనం సాగించే కూలీలను కాంగ్రెస్‌ వైపు మళ్లించేందుకు దోహదం చేస్తాయని పీసీసీ యోచిస్తోంది.

CWC Leaders Promoting 6 Guarantees : నియోజకవర్గాల బాటపట్టిన ముఖ్య నేతలు.. ఇంటింటికీ కాంగ్రెస్​ 6 గ్యారెంటీలు

Congress Guarantees in Telangana : పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే నెలకు 200 యూనిట్లకు లోపు విద్యుత్తు వినియోగిస్తారో.. ఆ కుటుంబాలకు ఉచితమని ప్రకటించడంతో.. ఆ క్యాటగిరి కిందకు వచ్చే కుటుంబాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారతాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. చేయూత పేరుతో.. వృద్దులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటిరి మహిళలకు.. అర్హలైన వారికి నెలకు రూ.4000 పెన్షన్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా కింద రూ.10 లక్షలు వరకు ప్రయోజనం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇక ఆరోది.. ఇల్లులేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు ఆర్థిక సాయం, తెలంగాణ ఉద్యమకారులకు రూ.250 చదరపు గజాలు ఇంటి జాగా ఇస్తామని ఇచ్చిన హామీ కూడా ఓటర్లను ఆకర్శించేదిగా ఉన్నట్లు హస్తం పార్టీ పేర్కొంటోంది.

గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాలకు పార్టీ అధిష్ఠానంనియమించిన పరిశీలకుల ద్వారా ఈ ఆరు హామీల గ్యారంటీ కార్డును జనంలోకి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తోంది. కరపత్రాలు, గోడ పత్రికలు, ఫ్లెక్సీలు, గోడరాతలు ఇలా వివిధ రకాలుగా వాటిని గ్రామీణ ప్రాంతాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది. డీసీసీ అధ్యక్షులను, అసెంబ్లీ నియోజక వర్గాల ఇంఛార్జ్ బాధ్యత వహిస్తున్న ప్రధాన కార్యదర్శులను, పార్లమెంటుల వారీగా నియమితులైన ఏఐసీసీ పరిశీలకులను, పీసీసీ ఉపాధ్యక్షులను, పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్లను భాగస్వామ్యం చేసి నియోజక వర్గ స్థాయి నాయకుల ద్వారా.. పోలింగ్‌ బూతుల వారీగా వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Congress Guarantees Flexes in Main Centers in Telangana : ప్రధానంగా ఎక్కువ మంది చూడగలిగే ప్రాంతాలల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, గోడలపై రాతలు రాయించడం, ఇంటి తలుపులపైఆరు గ్యారంటీలకు చెంది పోస్టర్లు అంటించడం, పెద్ద సంఖ్యలో కరపత్రాలను రద్దీ ప్రదేశాలల్లో పంపిణీ చేయడం లాంటివి చేపట్టాలని నిర్ణయించినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌, కో ఛైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళిక బద్దంగా వెళ్లి.. ఓటర్లను ఆకర్షించేట్లు పార్టీ కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Congress Six Guarantees Telangana : విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన '6 గ్యారెంటీలు' ఇవే!

Rahul Gandhi At Congress Vijayabheri Sabha : '100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికే'

Telangana Congress Focus on MLA Candidates Selection : కాంగ్రెస్ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థుల చొరవ.. టికెట్‌ కోసం లాబీయింగ్​లు

ABOUT THE AUTHOR

...view details