ETV Bharat / state

CWC Meetings Schedule Hyderabad 2023 : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. షెడ్యూల్ ఇదే

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 11:39 AM IST

CWC Meetings Schedule Hyderabad 2023 : ఈనెల 16, 17వ తేదీల్లో హైదరాబాద్​లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్​ను తాజాగా ఏఐసీసీ విడుదల చేసింది.

Congress Working Committee
Telangana

CWC Meetings Schedule Hyderabad 2023 : హైదరాబాద్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌ను (CWC Meetings Schedule) ఏఐసీసీ విడుదల చేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 1:00 గంటలకు టీపీసీసీ ఇచ్చే లంచ్‌కు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు హోటల్ తాజ్‌కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. 17న ఉదయం 10:30 గంటలకు ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సాయంత్రం 5:00 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే విజయభేరీ బహిరంగ సభలో సీడబ్ల్యూసీ, అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఏల్పీ నేతలు పాల్గొంటారు. 18న ఎంపీలు మినహా మిగతా నాయకులంతా 119 నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపింది.

సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌..

  • ఈ నెల 16న మధ్యాహ్నం 1:00 గంటలకు.. టీపీసీసీ ఇచ్చే లంచ్‌కు హాజరుకానున్న సీడబ్ల్యూసీ సభ్యులు
  • 16న మధ్యాహ్నం 2:00 గంటలకు హోటల్ తాజ్‌కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం
  • 17న ఉదయం 10:30 గంటలకు ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం
  • 17న సాయంత్రం 5:00 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే సభకు హాజరుకానున్న నేతలు

CWC Meetings in Hyderabad on September 16th : సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహణపై ఇటీవలే పీసీసీ నేతలకు కేసీ వేణుగోపాల్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశాలతో దేశంలో 2024 లో జరగనున్న ఎన్నికలకు ఇక్కడనే కార్యాచరణ సిద్ధమవుతుందని అన్నారు. ఈ నెల 16, 17న తాజ్‌కృష్ణలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాలకు.. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) ,అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నట్లు.. ఇందుకోసం పటిష్ఠ భద్రత కల్పించాలని డీజీపీని కోరినట్లు రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) వివరించారు.

Congress Left Parties Alliance Telangana : వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు చిక్కు.. సీట్ల విషయంలో తేలని లెక్క

ఇటీవలే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్‌వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా 84 మందితో విడుదల చేసిన జాబితాలో 39మందిని సీడబ్ల్యూసీ జనరల్‌ సభ్యులు(CWC Members 2023)గా ప్రకటించిన అధిష్ఠానం.. 18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇంఛార్జ్‌లుగా, తొమ్మిది మందిని ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురిని ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పేర్కొంది. పార్టీలో అసమ్మతి వర్గంగా పేరొందిన జీ23 నాయకులైన శశిథరూర్‌, ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌ వంటి నేతలకు ఈ కమిటీలో చోటు కల్పించారు. సచిన్‌ పైలట్‌తో పాటు దీపా దాస్‌ మున్షి, సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌లను కొత్తగా సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారు.

ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సీడబ్ల్యూసీ జనరల్‌ సభ్యుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఒక్కరికే ఛాన్స్‌ లభించింది. శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహకు అవకాశం దక్కింది. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్‌ రెడ్డిలను ఎంపిక చేసింది. గతసంవత్సరం అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ స్థానంలో 47మందితో తాత్కాలికంగా స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ సీడబ్ల్యూసీని పునర్‌వ్యవస్థీకరిస్తూ జాబితాను విడుదల చేశారు.

Congress Screening Committee Meeting : 'అభ్యర్థుల జాబితా ఇప్పుడే తేల్చలేం.. మరోసారి భేటీ అయ్యాక చెబుతాం'

Congress CWC Meeting Arrangements in Telangana : 'ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజయభేరి సభను ఆపలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.