ETV Bharat / state

Telangana Congress Focus on MLA Candidates Selection : కాంగ్రెస్ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థుల చొరవ.. టికెట్‌ కోసం లాబీయింగ్​లు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 8:31 AM IST

Updated : Sep 19, 2023, 9:12 AM IST

Telangana Congress Focus on MLA Candidates Selection : అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు నాయకులు చొరవ చూపుతున్నారు. అందుకు టికెట్‌ కోసం ఉన్నతస్థాయిలో లాబీయింగ్‌ మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే స్క్రీనింగ్‌ కమిటీ ప్రసన్నానికి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Telangana Congress Focus on Selection of MLA Candidates
Telangana Congress

Telangana Congress Focus on MLA Candidates Selection కాంగ్రెస్ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థుల చొరవ టికెట్‌ కోసం లాబీయింగ్​లు

Telangana Congress Focus on MLA Candidates Selection 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections)కు అభ్యర్థుల ఎంపికపై.. కాంగ్రెస్ దృష్టి సారించింది. 1,006 మంది జాబితాను పరిశీలించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(PCC President Revanth Reddy) నేతృత్వంలోని కమిటీ.. నియోజకవర్గాల వారీగా నచ్చిన నేతలకు టిక్‌మార్క్‌(Tick Mark)తో ప్రాధాన్యత క్రమాలిచ్చారు. ఒక నియోజకవర్గంలో ఎక్కువ మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా.. ముఖ్యమైన, ప్రజాబలం కలిగిన వారిని ఎంచుకొని ప్రాధాన్యతలిచ్చారు. పీఈసీ(PEC) వడపోత తర్వాత వెయ్యిగా ఉన్న ఆశావహుల సంఖ్య.. 2 నుంచి 3 వందలకు తగ్గినట్లు తెలుస్తోంది. అందులో 35 నుంచి 40 వరకు ఒకే వ్యక్తి పేర్లు, దాదాపు 40 వరకు ఇద్దరివి, మిగిలినవి నియోజకవర్గాలకు మూడు, నాలుగు పేర్ల ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఒకే పేరు వచ్చిన ప్రతిపాదనలపై కేవలం పరిశీలనే చేపట్టనున్నారు.

Telangana Congress MLA Candidates 2023 : రెండుపేర్లు వచ్చిన నియోజకవర్గాలపై స్క్రీనింగ్‌ కమిటీ(Screening Committee) లోతైన పరిశీలన చేస్తారని పీసీసీ అంచనా వేస్తోంది. ఈ నెల 20న స్క్రీనింగ్‌ కమిటీ దిల్లీలో సమావేశమయ్యే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ కమిటీ అంగీకారం తెలిపి కేంద్ర ఎన్నికల కమిటీ(Central Election Committee)కి సిఫారసు చేస్తే.. అధిష్ఠానం ఆమోదం లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. స్క్రీనింగ్‌ కమిటీ ప్రసన్నానికి ఆశావహులు.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన, కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనలు వీలైనంత త్వరగా పూర్తి చేసి.. 50 నుంచి 60 పేర్లతో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది.

Congress Screening Committee to Meet on 20th September : ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

Congress Plans For Telangana Assembly Elections 2023 : స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌, జిగ్రేష్‌ మెవాని, బాబా సిద్దిఖీని కలుస్తున్న ఆశావహులు తమ పేర్లు సిఫారసు చేసుకునేందుకు లాబీయింగ్‌(Lobbying) చేస్తున్నారు. మురళీధరన్‌ పార్లమెంట్‌ సభ్యుడు కావడంతో ఆయనకు దగ్గరగా ఉండే ఎంపీల కోసం ఆరా తీస్తున్నారు. ఇద్దరు సభ్యులు.. ఎవరికి దగ్గరగా ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరైతే డబ్బులు ఎర చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడో కంటికి తెలియకుండా ఆశావహుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

T Congress Focus on Telangana Assembly Elections 2023 : ఈ నెల 20న స్క్రీనింగ్‌ కమిటీ భేటీ ఉండడంతో.. టికెట్లు దక్కించుకోవాలన్న నేతలు దిల్లీ బాట పడతారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులతో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులకు సిఫారసు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయినా పోటీ అధికంగా ఉండడంతో టికెట్‌ దక్కించుకోవాలని ఆత్రుత చాలా మంది నాయకుల్లో కనిపిస్తోంది. అయితే ఒక్కరు, ఇద్దరి పేర్లతో కూడిన జాబితాపై క్షేత్రస్థాయిలో పార్టీ.. సర్వేలు చేయస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక, రాజకీయ అంశాలతో పాటు స్థానిక పరిస్థితులను అంచనా వేసేందుకు నిర్వహిస్తున్న ఆ సర్వేల ద్వారా.. ఇతరత్ర అంశాలను బేరీజు వేసి బలమైన నాయకుడిని ఎన్నికల బరిలో దించే అవకాశం ఉంటుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

Congress Door to Door Campaign in Telangana : జోరుగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం.. ఆరు హామీలను వందరోజుల్లో అమలుచేస్తామని హామీ

Revanth Reddy Counter to BRS Leaders : 'కేసీఆర్‌ సర్కారుకు ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయి.. బీఆర్​ఎస్​ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు'

Last Updated : Sep 19, 2023, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.