తెలంగాణ

telangana

Congress on Revanth Comments : 'రేవంత్​ వ్యాఖ్యలను వక్రీకరించారు'.. హాట్​హాట్​గా పవర్ ​పాలిటిక్స్

By

Published : Jul 11, 2023, 4:32 PM IST

Updated : Jul 11, 2023, 4:55 PM IST

BRS And Congress controversy on Free electricity : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో 'పవర్​ పాలిటిక్స్'​ తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్​ అవసరంలేదన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ నాయకులు అవకాశంగా మలుచుకున్నారు. రైతు వ్యతిరేక విధానాలను మరోసారి హస్తం పార్టీ బయటపెట్టిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యలో కాంగ్రెస్​ నేతలు​ స్పందించారు. కాంగ్రెస్ అంటేనే రైతులు.. రైతులు అంటేనే కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. రేవంత్​ మాటలను వక్రీకరించారని మండిపడ్డారు. విద్యుత్‌ కొనుగోళ్ల అవినీతిపై బీఆర్​ఎస్​ చర్చకు సిద్ధమా? అంటూ కోమటిరెడ్డి సవాల్​ విసిరారు.

Congress on Free Power Cancel Comments
Congress on Free Power Cancel Comments

Revanth Reddy comments on free electricity for farmers : రాష్ట్రంలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తుడటంతో ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలపై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో 'పవర్​ పాలిటిక్స్'​ అంశం తెర మీదకు వచ్చింది. ఉచిత విద్యుత్​పై కాంగ్రెస్​ చేసిన వ్యాఖ్యలను అధికార బీఆర్​ఎస్​ పార్టీ అవకాశంగా మార్చుకొంటుంది.

రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ మరోసారి బయటపెట్టిందని ఆ పార్టీ​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కర్షకులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ ప్రకటించిన కాంగ్రెస్‌ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలోనూ రైతులకు విద్యుత్‌ ఇవ్వకుండా గోస పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఆలోచనల్ని తెలంగాణ రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఈ నేపథ్యంలో హస్తం నేతలు సైతం దీనిపై స్పందించారు.

Komatireddy Venkatareddy on free electricity for farmers : గ్రామాల్లో పది గంటల ఉచిత విద్యుత్‌ కూడా రావట్లేదని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పేరుకే 24 గంటల ఉచిత విద్యుత్‌ కానీ.. కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్‌ వృథా అవుతోందన్న కోమటిరెడ్డి.. ట్రాన్స్‌కో, జెన్​కో అప్పులపాలయ్యాయని అన్నారు. తాము అధికారంలోకి వస్తేఉచిత విద్యుత్‌ఇవ్వటం పెద్ద లెక్క కాదన్న ఆయన.. రేవంత్‌రెడ్డి ఏ సందర్భంలో 8గంటల ఉచిత విద్యుత్‌ చాలని అన్నారో అడిగి తెలుసుకుంటానన్నారు.

"రేవంత్​రెడ్డి ఒక్కరే పార్టీ కాదు. లక్షల కొద్ది కార్యకర్తల సముహమే కాంగ్రెస్. రేవంత్​ అన్న మాటలు ఆయన వ్యక్తి గతం. ఆయన పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉచిత విద్యుత్​పై ఆ వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ హైకమాండ్​ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం రేవంత్​ అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చి దీనిపై వివరణ ఇస్తారు".-కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి ఎంపీ

Ponnam Prabhakar on free electricity for farmers : మరోవైపు దీనిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ స్పందించారు. రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతిచ్చిన బీఆర్​ఎస్​ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతికత లేదని మండిపడ్డారు. దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఉద్ఘాటించారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రేవంత్‌రెడ్డి మాట్లాడితే వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే రైతులు.. రైతులు అంటేనే కాంగ్రెస్ అని చెప్పిన పొన్నం.. విద్యుత్‌ కొనుగోళ్ల అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్​ఎస్​ నేతలకు సవాల్‌ విసిరారు.

"కేసీఆర్ సర్కార్​కు రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి బీఆర్ఎస్ మాట్లాడుతోంది. విద్యుత్ కొనుగోలులో అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్దమా.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా. కాంగ్రెస్​కు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్​లో వణుకు పుడుతోంది. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ ఎజెండా. రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది."-పొన్నం ప్రభాకర్​, మాజీ ఎంపీ

'రేవంత్​ వ్యాఖ్యలను వక్రీకరించారు'

ఇవీ చదవండి:

Last Updated : Jul 11, 2023, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details