తెలంగాణ

telangana

సంక్రాంతి స్పెషల్ - భోగి మంటలతో వెలుగులీనుతున్న తెలుగు లోగిళ్లు

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 10:03 AM IST

Updated : Jan 14, 2024, 2:18 PM IST

Bhogi Celebrations in Telangana 2024 : రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. నేడు భోగి పర్వదినం కావడంతో, ఊరువాడ తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. మంటల చుట్టూ తిరుగుతూ చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ సందడి చేశారు.

Bhogi Celebrations in Telangana 2024
Bhogi Celebrations in Telangana 2024

భోగి మంటలతో వెలుగులీనుతున్న తెలుగు లోగిళ్లు

Bhogi Celebrations in Telangana 2024 : సరదాల సంక్రాంతికి తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తొలిరోజు భోగి పండుగ సంబురాలు, ఊరూరా వాడవాడలా అంబరాన్నంటాయి. భాగ్యనగరవాసులు భోగి పర్వదినాన్ని (Bhogi Celebrations 2024)ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు సందడి చేశారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

Sankranti Celebrations in Telangana 2024 :కూకట్‌పల్లిలో గంగిరెద్దుల ఆటలు, హరిదారుల సంకీర్తనలు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భోగి మంటల మధ్య చిన్నాపెద్ద నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను నేటితరం పిల్లలకు తెలిసే విధంగా ఏర్పాటు చేశారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిచడంతో పాటు చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుకు వచ్చాయని వారు అంటున్నారు.

సంక్రాంతికి, గాలిపటానికి సంబంధం ఏంటీ? అసలెందుకు ఆరోజు పతంగులను ఎగరవేస్తారు?

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగి పర్వదినాన్ని (Bhogi Festival 2024) గ్రామాల్లో, పట్టణాల్లో ఉత్సాహంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే లేచి వాకిట్లో రంగు, రంగుల ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలను వాకిట్లో పేర్చి భోగి వేడుకలు చేసుకున్నారు. తాము పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలు కలగాలని ప్రజలు కోరుకున్నారు. భోగి మంటలు ప్రజల మధ్య దూరం తగ్గించి, ఐకమత్యం పెంచుతుందని వారు అంటున్నారు.

Sankranti Celebrations 2024 :నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారంలో పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కీడు తొలగిపోవాలని స్థానికులు కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఇందల్‌వాయిలో భోగి వేడుకలు ఆబాలగోపాలం ఉత్సాహంగా సాగాయి. కరీంనగర్‌లో జిల్లా వ్యాప్తంగా ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరిగాయి. వేకువజామునే ఇళ్ల ముందు కల్లాపి జల్లి, రంగురంగుల రంగవళ్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు.

పిల్లలపై భోగి పళ్లు ఎందుకు పోస్తారు? పురాణాలు చెప్పేది ఇదే!

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలంతా తెల్లవారుజామునే ఒక దగ్గర చేరి భోగి మంటలు వేశారు. అనంతరం మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ అలరించారు. గోదావరిఖనిలో గంగిరెద్దుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా సంక్రాతి పండుగ శోభ మొదలైంది. మూడు రోజుల పండుగలో భాగంగా తొలిరోజు భోగభాగ్యాలు తెచ్చే భోగి పండుగను ప్రజలు అట్టహాసంగా జరిపారు.

Bhogi Festival 2024 Celebrations In Telangana :మంచిర్యాలలో వాకిళ్ల ముందు తీరొక్క రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్థానికులు కుటుంబ సభ్యులతో కలిసి భోగిమంటల చుట్టూ తిరుగుతూ సంబరాలు చేశారు. తాము పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలు కలగాలని ప్రజలు కోరుకున్నారు.

తెలంగాణలో సంక్రాంతి సంబురం - ఆకట్టుకుంటున్న రంగవళ్లులు

రాష్ట్రంలో మదినిండుగా భోగి సంబరాలు

Last Updated :Jan 14, 2024, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details