తెలంగాణ

telangana

'ఆ బోర్డు తీసేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతాం'

By

Published : Jun 26, 2022, 7:10 PM IST

BALKA SUMAN: హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన 'సాలు దొర.. సెలవు దొర' డిజిటల్ బోర్డును తీసేయాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. కౌంట్​డౌన్​ భాజపాకే మొదలైంది తప్పా.. తెరాసకు కాదన్నారు. దేశంలో భాజపాయేతర ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన విమర్శించారు.

'ఆ బోర్డు తీసేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతాం'
'ఆ బోర్డు తీసేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతాం'

BALKA SUMAN: భాజపా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 'సాలు దొర.. సెలవు దొర' అనే డిజిటల్‌ బోర్డును తీసేయాలని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రధాని మోదీ బోర్డులు రాష్ట్రవ్యాప్తంగా పెట్టి.. చెప్పుల దండ వేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా దేశంలో భాజపాయేతర ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలకు మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు వివేకానంద, ముఠా గోపాల్‌, డాక్టర్ మెతుకు ఆనంద్‌, నోముల భగత్‌, ఎమ్మెల్సీ దండే విఠల్​తో కలిసి ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్​ భాజపాపై నిప్పులు చెరిగారు. కౌంట్​డౌన్‌ భాజపాకే మొదలైంది తప్పా.. తెరాసకు కాదని బదులిచ్చారు. దేశంలో మోదీ దిగిపోవాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. భాజపాయేతర ప్రభుత్వాలు పడగొట్టేందుకు మోదీ ప్రాధాన్యమిస్తున్నారన్న ఆయన.. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గోవా తదితర రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను భాజపా కూలగొట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే పని చేస్తోందని దుయ్యబట్టారు.

భాజపా కార్యాలయం ముందు కేసీఆర్ బోర్డు తీసేయాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు ఏర్పాటు చేస్తాం. కౌంట్​డౌన్​ మొదలైంది భాజపాకే. తెరాసకు కాదు. మోదీకి ప్రభుత్వాలను పడగొట్టడం మీద ఉన్న శ్రద్ధ దేశంపై లేదు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భాజపా పావులు కదుపుతోంది.-బాల్క సుమన్, ప్రభుత్వ విప్

'ఆ బోర్డు తీసేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతాం'

bogata waterfall: ప్రకృతి ప్రేమికులను రారమ్మంటున్న బొగత జలపాతం

అగ్నిపథ్​ ఉపసంహరణకే పలు రాష్ట్రాలు డిమాండ్​.. ఆగని నిరసనలు!

ABOUT THE AUTHOR

...view details