తెలంగాణ

telangana

పనామా చోరీ రాంజీ గ్యాంగ్ పనేనా?

By

Published : May 8, 2019, 11:19 PM IST

పనామా చోరీ కేసులో నిందితులు తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్​గా  పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం 20 ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. చోరీలో ఏజెన్సీ హస్తంపై విచారణ చేస్తున్నారు.

atm-cash-chory

పనామా చోరీ నిందితులు రాంజీ గ్యాంగ్​గా అనుమానం

సంచలనం సృష్టించిన హైదరాబాద్ వనస్థలీపురం చోరీ కేసులో నిందితులు తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్​గా పోలీసులు అనుమానిస్తున్నారు. దృష్టిమరల్చి దోపిడీలకు పాల్పడటంలో దిట్టగా పేరుగాంచిన రాంజీ గ్యాంగ్‌ కదలికలపై ఆరా తీసేందుకు దాదాపుగా 20 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే కొన్ని బృందాలు తమిళనాడుకు వెళ్లాయి. ఆటో డ్రైవర్​ను విచారించిన పోలీసులు... వారు దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలో ఆటో దిగి వెళ్లిపోయారని తెలుసుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.

ఏజెన్సీ పాత్రపైన విచారణ

హైదరాబాద్ పనామలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ వద్ద నిన్న జరిగిన చోరీపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. చోరీ జరగడానికి గంట ముందే నిందితులు పక్కనే ఉన్న ఓ హోటల్​లో భోజనం చేసి రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. తప్పించుకునేందుకు వీలుగా ఉంటుందని నగర శివారు ప్రాంతాన్ని ఎంచుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డబ్బును ఏటీఎంలో జమచేసే ప్రైవేటు ఏజెన్సీ పాత్ర ఏమేరకు ఉందన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు.

రాచకొండ సీపీ పర్యవేక్షణ

బ్యాంకుల్లో లక్షల కొద్దీ నగదును జమ చేసే ఏజెన్సీలు అజాగ్రత్తగా, ఒక మాములు వాహనంలో డబ్బును తీసుకు రావడంపై సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏజెన్సీ హస్తం తదితర అంశాలపై పోలీస్‌ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. కేసు విచారణను ఎప్పటికప్పుడు రాచకొండ కమిషనర్‌ మహేశ్​ భగవత్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈనెల 15న 'ఇంటర్​ వివరాలు' సమర్పించండి

Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details