తెలంగాణ

telangana

ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

By

Published : Oct 25, 2021, 4:05 PM IST

ఆనందయ్య కంటి చుక్కల మందుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Anandaiah
Anandaiah

ఆనందయ్య కంటి చుక్కల మందుపై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారు చేసే కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై కోర్టు విచారణ జరిపింది. ఆ దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. కాగా, తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ సందర్భంగా దరఖాస్తు, ప్రభుత్వ జవాబును ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఆనందయ్య కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కరోనా వల్ల ప్రభుత్వాసుపత్రిలో ఎందరు మరణించారని ప్రశ్నించింది. ఆనందయ్య మందు వల్ల ఎంతమంది మరణించారు అని అడిగింది.

ఇదీ చూడండి:KCR speech in trs plenary: ఏపీలో మీ పార్టీ పెట్టండి.. గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details