తెలంగాణ

telangana

ఈటల వ్యవహారం సీఎం పరిధిలో ఉంది: తలసాని

By

Published : May 1, 2021, 5:38 PM IST

ఈటల వ్యవహారం సీఎం కేసీఆర్​ పరిధిలో ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. భాజపా ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు.

talasani
తలసాని శ్రీనివాస్​ యాదవ్

కరోనా విషయంలో కేంద్రం వైఖరిని గమనించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కోరారు. కరోనాపై పోరులో ప్రధానికి సీఎం కేసీఆర్‌ ఎన్నోసార్లు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. భాజపా ఎంపీ అర్వింద్‌ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

కరోనా విషయంలో ప్రపంచం మొత్తం అతలాకుతలమైందని.. ప్రధాని, కేంద్రమంత్రులు ఉన్న దిల్లీలో పరిస్థితి అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఈటల వ్యవహారం సీఎం కేసీఆర్‌ పరిధిలో ఉందని చెప్పారు. విపక్ష నేతలు ఎన్నైనా మాట్లాడతారని.. ఆధారాలుంటే చూపాలని తలసాని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:హోం లోన్​ వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్​బీఐ

ABOUT THE AUTHOR

...view details