తెలంగాణ

telangana

ఫార్ములా E రేసు.. కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్

By

Published : Feb 4, 2023, 10:03 AM IST

Formula e-Race in Hyderabad : ఇండియాలోనే మొట్టమొదటి సారిగా ఫార్ములా ఇ-రేసు జరగబోతోంది. ఈ రేసింగ్‌కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఈ క్రమంలో ఫార్ములా ఇ-రేసును హైదరాబాద్ తీసుకొస్తున్నందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టికి సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఫిబ్రవరి 11న జరగబోయే ఈ ఈవెంట్‌ను చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుపుతున్నారు.

Formula e-Race in Hyderabad
Formula e-Race in Hyderabad

Formula e-Race in Hyderabad : భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఇ-రేసింగ్ ఈవెంట్​ జరగనుంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్​పై ఈవెంట్ జరగనుంది. ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

Formula e-Race in Hyderabad on Feb 11th : ఈవెంట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈఓ దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉన్నారు.. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎక్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎక్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Anand Mahindra tweet on Formula e-Race : ఫార్ములా ఇ-రేసును హైదరాబాద్‌కు తీసుకొచ్చినందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఫార్ములా-ఇ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్‌ ఆవిర్భవించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్, అడివి శేష్ వంటి హీరోలు ఫార్ములా ఇ-రేసు గురించి మాట్లాడి కేటీఆర్‌కు, గ్రీన్‌ కోకు కృతజ్ఞతలు తెలిపారు.

తాజాగా ఈ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చేరారు. ఫార్ములా-ఇ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్‌ ఆవిర్భవించిందని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా శుక్రవారం ట్విటర్‌లో ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Nagarjuna on Formula E racing: ఫార్ములా ఈ రేసింగ్‌పై టాలీవుడ్ కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఇండియాలో మొదటి సారిగా జరుగుతున్న ఫార్మూలా ఈ రేసింగ్‌‌కు హైదరాబాద్ అతిథ్యం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టిలకు థ్యాంక్స్ చెప్పారు. ఈ రేస్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

mahesh babu on Formula E racing : ఇక ఫార్ములా ఈ రేసింగ్‌పై మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఇండియాలో మొదటి సారిగా జరుగుతున్న ఫార్మూలా ఈ రేసింగ్‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఓ గొప్ప విషయం. ఓ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన కేటీఆర్‌కు, అనిల్ చలమలశెట్టికి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 11న జరుగునున్న ఈ రేసు పోటీలను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అని మహేశ్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Adivi sesh on Formula E racing : ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అన్నారు. హైదరాబాద్‌కు ఈ ఘనత తీసుకొస్తున్న మంత్రి కేటీఆర్, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టి, తెలంగాణ ప్రభుత్వానికి శేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ ఈవెంట్‌లో తాను తప్పక పాల్గొంటానని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details