ETV Bharat / state

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఫార్ములా ఈ రేస్​కు ఏర్పాట్లు.. బుక్​ మై షోలో టిక్కెట్లు

author img

By

Published : Jan 29, 2023, 9:41 AM IST

Indian Racing League Arrangements: హైదరాబాద్​లో ఫిబ్రవరి 11 నుంచి జరగనున్న ఫార్ములా ఈ రేస్​కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈసారి తెలంగాణ అభివృద్ధి సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లను చేస్తున్నారు. అటు లేజర్ షో.. ఇటు ఫార్ములా-ఈ రేస్ జరగనుండటంతో ట్యాంక్ బండ్ ప్రాంతం పలు పనులతో రద్దీగా మారింది. మరోవైపు ఈ-రేస్‌ ఫార్ములాకు సంబంధించి టికెట్లు ఇప్పటికే బుక్ మై షోలో అమ్మకానికి పెట్టారు.

Farmula E RACE for Arrangements
Farmula E RACE for Arrangements

ఫార్ములా ఈ రేస్​కు జరుగుతున్న ఏర్పాట్లు

Tormula E RACE In Hyderabad: హైదరాబాద్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న ఫార్ములా ఈ రేస్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ తీరాన రయ్‌ మంటూ స్పోర్ట్స్‌ కార్లు దూసుకెళ్లేందుకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్​ గార్డెన్ నుంచి ఐమ్యాక్స్​ మీదుగా 2.8 కిలోమీటర్లు దీనికోసం స్ట్రీట్ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. అటు లేజర్ షో.. ఇటు ఫార్ములా-ఈ రేస్ జరగనుండటంతో ట్యాంక్ బండ్ ప్రాంతం పలు పనులతో రద్దీగా మారింది. ఫిబ్రవరి 11 న ఫార్ములా ఈ-రేస్ జరగనుంది. ఈసారి తెలంగాణ అభివృద్ధి సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లను చేస్తున్నారు. అందరూ ఈ పోటీల గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్ తీరాన ఫార్ములా-ఈ రేస్ అంతర్జాతీయ పోటీలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్​ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, సచివాలయం, మింట్ కాంపౌండ్ , ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోటీలను దృష్టిలో పెట్టుకొని ఈ రహదారికి తుది మెరుగులు దిద్దుతున్నారు. పక్కన బారికేడ్లకు రంగులు అద్దుతున్నారు. 11 ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్ కార్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాటనున్నారు. వారం ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చే సూచనలున్నాయి. స్ట్రీట్ సర్క్యూట్‌కు ఇరువైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లతోపాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఇప్పటికే బుక్ మై షోలో ఈ-రేస్‌ ఫార్ములాకు సంబంధించి టికెట్లు అమ్మకానికి పెట్టారు. పోటీలకు తరలివచ్చే దేశ, విదేశీ పర్యాటకుల కోసం హుస్సేన్‌సాగర్ చుట్టూ సరికొత్త హంగులు తీసుకొస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ లోపల 7 కోట్లతో నీటిపై తేలే మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్‌ షో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించి పనులు కొలిక్కి వచ్చాయి. పోటీలు జరిగే నాలుగైదు రోజుల ముందే ఇవి ప్రారంభం కానున్నాయి. లేజర్ షోలో హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు తెలిపే ఘట్టాలను ప్రదర్శించనున్నారు. పర్యాటక శాఖ నడిపే పడవల్లో వెళ్లి తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాక రోడ్డుపై నిలబడి పర్యాటకులు ఉచితంగానే ఈ షోను వీక్షించవచ్చు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శిస్తారు. ఫార్ములా-ఈ రేస్ తర్వాత మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్‌ షో కొనసాగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.