తెలంగాణ

telangana

ఉద్రిక్తతకు దారి తీసిన మంత్రి కార్యాలయ ముట్టడి.. పలువురు అరెస్టు

By

Published : Nov 15, 2022, 3:47 PM IST

Nizam College Hostel problem: నిజాం కళాశాల యూజీ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు తలపెట్టిన విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు బషీరా​బాగ్​లోని సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం గేటు ముందు బైఠాయించి.. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు తోపులాట, వాగ్వాదం జరిగింది.

Nizam College Hostel problem
Nizam College Hostel problem

Nizam College Hostel problem: నిజాం కళాశాల యూజీ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తలపెట్టిన విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో.. ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు బషీరా​బాగ్​లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. నిజాం కళాశాల హాస్టల్ సమస్యను పరిష్కరించాలని.. మంత్రికిి వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను దాటుకొని ప్రవీణ్​రెడ్డి లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంలో పోలీసులకు ఆందోళన కారులకు తోపులాట, తీవ్ర వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పరిస్థితి విషమించడంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ , ఉస్మానియా యూనివర్సిటీ వీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రవీణ్​రెడ్డి ఆరోపించారు. గత 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న అధికారులు వారిని పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్​ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

"కళాశాల ప్రిన్సిపాల్ , ఉస్మానియా యూనివర్సిటీ వీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గత 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు 50 శాతం మహిళలు ఉన్న కళాశాలలో హాస్టల్ వసతి కల్పించకపోవడం దారుణం. యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి ఈ దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నారు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్​ను పరిష్కరించాలి"- ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి

ఉద్రిక్తతకు దారి తీసిన మంత్రి కార్యాలయం ముట్టడి.. పలువురు అరెస్టు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details