తెలంగాణ

telangana

తుపాకీతో హల్‌చల్‌ చేశాడు .. చివరకి పోలీసులకు పట్టుబడ్డాడు

By

Published : Nov 9, 2022, 12:27 PM IST

Updated : Nov 9, 2022, 8:42 PM IST

Young Man Hulachal with a Gun in Ameerpet: హైదరాబాద్‌లో బిగ్‌బజార్‌ వద్ద ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. గన్‌ చూపిస్తూ రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులను బెదరగొట్టాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Young Man Hulachal with a Gun in Ameerpet
Young Man Hulachal with a Gun in Ameerpet

Young Man Hulachal with a Gun in Ameerpet: హైదరాబాద్‌లోని అమీర్‌పేట బిగ్‌బజార్‌ వద్ద వెంకట నాగేందర్‌రెడ్డి అనే వ్యక్తి తుపాకీతో హల్‌చల్‌ సృష్టించాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్న విశ్రాంత ఆర్మీ ఉద్యోగి నాగేందర్​ రెడ్డి .. ఉదయం హిజ్రాలతో గొడవకు దిగాడని చెప్పారు. వెంటనే తన వద్ద ఉన్న లైసెన్స్ గన్​ను చూపిస్తూ వారిని రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులను బెదరగొట్టాడని తెలిపారు.

ఈ విషయాన్ని గమనించిన పెట్రోలింగ్‌ పోలీసులు.. వివాదం ఆపేందుకు యత్నించారని తెలిపారు. అయితే పెట్రోలింగ్‌ సిబ్బందిపైకి కూడా తుపాకీ గురిపెట్టి బెదరగొట్టాడని చెప్పారు. ఈక్రమంలో కానిస్టేబుల్ సాయికుమార్​ నాగేందర్​రెడ్డిని చాకచక్యంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి తుపాకీ, ఆరు బులెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నాగేందర్ రెడ్డిని చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ సాయికుమార్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అభినందించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 9, 2022, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details