తెలంగాణ

telangana

CM KCR Meeting: ఆయుధాలతో సీఎం కేసీఆర్​ సభకు.. ముగ్గురి అరెస్టు

By

Published : Apr 16, 2023, 12:22 PM IST

Man Brought Gun to CM KCR Meeting in Hyderabad: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సమయంలో.. సీఎం కేసీఆర్​ సభ జరుగుతుండగా ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను సైఫాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఖైరతాబాద్‌కు చెందిన దొండ్ల మధుయాదవ్‌ వద్ద పని చేసే శివ, గురుసాహెబ్​సింగ్​గా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

రైఫిల్
రైఫిల్

Man Brought Gun to CM KCR Meeting in Hyderabad: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సభకు ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అంబేడ్కర్​ జయంతి రోజు శుక్రవారం హైదరాబాద్‌లో విగ్రహావిష్కరణ సభలో వీవీఐపీలు ఉన్న సమయంలో ఓ వ్యక్తి రైఫిల్​తో వచ్చేందుకు ప్రయత్నించాడు.

ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర పోలీసులు తనిఖీ చేసి అతడిని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన దానిని యజమాని కారులో ఉంచి సభలోకి వెళ్లారు. కొద్దిసేపటికి శివ అనే వ్యక్తి కారులోని రైఫిల్‌తో బయటకు రావడంతో అక్కడున్న పోలీసులు ప్రశ్నించారు. తాను ఖైరతాబాద్‌కు చెందిన దొండ్ల మధుయాదవ్‌ (31) డ్రైవర్‌నని, ఆయధం గన్‌మెన్‌దని చెప్పడంతో, అప్పటికే సభలోకి వెళ్లిన వారిని వెనక్కి పిలిపించి సైఫాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పంజాబ్‌ గన్‌మెన్‌..తన భద్రతకు గన్‌మెన్‌ కావాలని మధుయాదవ్‌ దిల్లీలోని ‘సామ్రాట్‌ సెక్యూరిటీస్‌’ను సంప్రదించాడు. వారు అతడికి పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్‌ జవాన్​ గురుసాహెబ్‌ సింగ్‌ను కేటాయించారని పోలీసుల విచారణలో తెలిసింది. గురుసాహెబ్‌సింగ్‌ దగ్గర ఉన్న రైఫిల్‌, పిస్తోల్‌లకు జమ్మూకశ్మీర్‌లో లైసెన్స్​ పొందినట్లు సంబంధిత పత్రాలు చూపారు. నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రత కోసం తీసుకున్న ఆయుధాలను గన్​మెన్​గా వినియోగించేందుకు కుదరదు. ఇతరుల వల్ల ప్రాణహాని ఉన్నవారు అంగరక్షకుడిని పెట్టుకోవాలంటే ముందుగా పోలీసు కమిషనర్‌ అనుమతి తీసుకోవాలి. సదరు వ్యక్తి ఈ నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఆయుధాలతో ముఖ్యమంత్రి, వీవీఐపీలు ఉన్న వేదిక వద్ద సంచరించడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

మధుయాదవ్‌ కారు డ్రైవర్‌.. తాడేపల్లిగూడెం నివాసి శివప్రకాష్‌, గన్‌మెన్‌ గురుసాహెబ్‌సింగ్‌లను అరెస్టు చేశారు. గన్‌మెన్‌ నుంచి పాయింట్‌ 32 పిస్తోలు, 44 తూటాలు, పాయింట్‌ 315 బోర్‌ రైఫిల్‌, 50 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. 2002లో తీసుకున్న గురుసాహెబ్​సింగ్​.. పిస్తోల్‌ ట్రయల్స్‌ కోసం 6 రౌండ్లు ఉపయోగించినట్లు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.

గురుసాహెబ్​సింగ్

ఎవరీ మధుయాదవ్‌?దొండ్ల మధుయాదవ్‌ ఖైరతాబాద్‌కు చెందిన పాలవ్యాపారి. తన తమ్ముడు చంద్రకాంత్‌ యాదవ్‌ పెళ్లి సందర్భంగా ఉగాది రోజున ప్రత్యేక హెలికాప్టర్‌లో పుణె వెళ్లి అక్కడి 150 ఏళ్ల చరిత్ర కలిగిన దగ్గుసేత్‌ గణపతి ఆలయంపై పూలవర్షం కురిపించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యి వార్తల్లో నిలిచాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details