తెలంగాణ

telangana

TS Corona Cases: రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా... కొత్తగా 1,913 కేసులు నమోదు

By

Published : Jan 6, 2022, 8:03 PM IST

Updated : Jan 6, 2022, 8:43 PM IST

corona
corona

19:59 January 06

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

TS Corona Cases: రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య ఇవాళ రెండు వేలకు చేరువైంది. తాజాగా 54,534 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేపట్టగా వారిలో 1,913 మందికి వైరస్ నిర్ధరణ అయినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 6,87,456 మంది మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా మరో 232 మంది కోలుకోగా... వైరస్ నుంచి మొత్తం 6,75,573 మంది రికవరీ అయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో ఇద్దరు మృతి చెందగా... మహమ్మారితో ఇప్పటి వరకు 4,036 మంది మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 7,365 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

జిల్లాల్లో...

తాజాగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ 1,214 కేసులు నమోదవగా... ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 8, జగిత్యాల 9, జనగామ 4, జోగులాంబ గద్వాల 4, కామారెడ్డి 7, కరీంనగర్ 24, ఖమ్మం 25, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 12, మహబూబాబాద్ 33, మంచిర్యాల 12, మెదక్ 9, మేడ్చల్ మల్కాజిగిరి 161, నాగర్‌కర్నూల్ 2, నల్గొండ 16, నారాయణపేట 1, నిజామాబాద్ 28, పెద్దపల్లి 13, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి 213, సంగారెడ్డి 24, సిద్దిపేట 14, సుర్యాపేట 10, వికారాబాద్ 12, వనపర్తి 5, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 24, యాదాద్రి భువనగిరిలో 15 చొప్పున నమోదయ్యాయి. ఇక ఈరోజు మొత్తం 4,55,591 డోసుల టీకాలు పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

Last Updated : Jan 6, 2022, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details