తెలంగాణ

telangana

YS Sharmila: 'పంట సాగు చేయని రైతులకు ఎకరానికి 25 వేలు పరిహారం చెల్లించాలి'

By

Published : Apr 15, 2022, 4:45 PM IST

YS Sharmila: రైతులను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని వైఎస్​ఆర్​ తెలంగాణ​ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్​ మాటలు విని రాష్ట్రంలో 17లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేయలేదని అన్నారు. ప్రభుత్వం తీరుతో పంట సాగు చేయని రైతులకు ఎకరానికి 25 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

YS Sharmila:  'పంట సాగు చేయని రైతులకు ఎకరానికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలి'
YS Sharmila: 'పంట సాగు చేయని రైతులకు ఎకరానికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలి'

YS Sharmila: వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్​ మాటలు విని రాష్ట్రంలో 17లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేయలేదని వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. పంట కొనుగోలు చేస్తామని చెబితే వారు కూడా పంట వేసుకునే వారు కదా అంటూ ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నుంచి టేకులపల్లి మార్గంలో షర్మిల చేపట్టిన పాదయాత్ర 56వ రోజు కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామంలో రైతు గోస కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులను కేసీఆర్​ మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కనీస మద్దతు ధర అందడం లేదని షర్మిల అన్నారు.

'పంట సాగు చేయని రైతులకు ఎకరానికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలి'

ప్రభుత్వం తీరుతో పంట సాగు చేయని రైతులకు ఎకరానికి 25 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో 8 వేల మంది రైతులు ప్రభుత్వ తీరుతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధనవంతులని చెబుతున్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నా వాగ్దానం ఎటు పోయిందని ప్రశ్నించారు. దళితులను ఎన్నిసార్లు మోసం చేస్తారని.. ఇప్పుడు దళితబంధు పేరిట మరోసారి మోసం చేసే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజశేఖర్​రెడ్డి బిడ్డగా వచ్చానన్న షర్మిల.. తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

'గతేడాదిలో 52లక్షల ఎకరాల్లో వరి వేస్తే.. ఈ ఏడాది 35 లక్షల ఎకరాల్లోనే వేశారు. అంటే కేసీఆర్​ వరి వేయొద్దన్నందుకు దాదాపు 17లక్షల ఎకరాల్లో పంట సాగు చేయలేదు. కేవలం కేసీఆర్​ చెప్పిన ఒక్క మాట వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారు. ఈ పాపం ఎవరిది.. కేసీఆర్​ది కాదా?' -వైఎస్​ షర్మిల, వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

టేకులపల్లి మండల పరిధిలోని మైల్ తండా సమీపంలో సినీ నటుడు శివారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్​ రాజశేఖర్ రెడ్డి గాత్రంతో షర్మిలను సినీనటుడు శివారెడ్డి ఆశీస్సులు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గొంతుకను అనుకరిస్తూ షర్మిలకు అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details