ETV Bharat / bharat

'గుజరాత్​ ఎన్నికలకు మేం సిద్ధం.. ఈసారి ఎంఐఎం సత్తా చాటడం ఖాయం!'

author img

By

Published : Apr 15, 2022, 3:12 PM IST

AIMIM Gujarat election: గుజరాత్​ శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కాంగ్రెస్​ వైఫల్యం కారణంగానే ఆ రాష్ట్రంలో భాజపా వరుస విజయాలు సాధిస్తోందని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో అభిప్రాయపడ్డారు.

aimim gujarat election
'గుజరాత్​ ఎన్నికలకు మేం సిద్ధం.. ఈసారి ఎంఐఎం సత్తా చాటడం ఖాయం!'

AIMIM Gujarat election: 2022 చివర్లో జరగనున్న గుజరాత్​ శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఇప్పటికే అసెంబ్లీలో ప్రజావాణిని వినిపిస్తోందని, పురపాలక సంస్థల ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో కార్పొరేటర్లు గెలిచారని గురువారం అహ్మదాబాద్​ పర్యటన అనంతరం ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంగా చెప్పారు. ఇటీవల యూపీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం చూపలేకపోవడంపైనా స్పందించారు ఒవైసీ.

'గుజరాత్​ ఎన్నికలకు మేం సిద్ధం.. ఈసారి ఎంఐఎం సత్తా చాటడం ఖాయం!'

"రానున్న నెలల్లో గుజరాత్​లో విస్తృతంగా పర్యటిస్తా. ఇక్కడి ప్రజల్ని కలుస్తా. గుజరాత్ ప్రజలు ఇప్పటికే మా పార్టీపై ప్రేమ కనబరిచారు. మమ్మల్ని అసెంబ్లీకి పంపారు. యూపీలో ఎంఐఎం గెలవలేకపోయింది. కానీ.. బిహార్​లో గెలిచింది. గుజరాత్​ పురపాలక సంస్థల ఎన్నికల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు. యూపీ ఎన్నికల కోసం మేము 18 రోజుల ముందే రంగంలోకి దిగాం. సమయం సరిపోక ఎన్నికలకు సరిగా సన్నద్ధం కాలేకపోయాం. కానీ ఈసారి అలా కాదు. గుజరాత్​ ఎన్నికలకు మేము పూర్తి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా గెలుస్తాం." అని విశ్వాసం వ్యక్తం చేశారు ఒవైసీ.

కంచుకోటలు ఉండవ్​!: గుజరాత్​.. భాజపాకు కంచుకోట అనే వాదనను తోసిపుచ్చారు ఒవైసీ. "ఏ పార్టీకీ అలా కంచుకోటలు ఉండవు. గత 27 ఏళ్లుగా భాజపా గెలుస్తోంది అంటే.. అందుకు కారణం కాంగ్రెస్​ వైఫల్యమే. గుజరాత్​లో మంచి నాయకత్వాన్ని తయారు చేసి, మా వాణి రాష్ట్ర శాసనసభకు చేరేలా చేయడమే మా లక్ష్యం" అని స్పష్టం చేశారు ఎంఐఎం అధినేత. శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్​లోని వేర్వేరు చోట్ల హింస చెలరేగడంపై స్పందించారు. అవాంఛిత ఘటనల్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.