ETV Bharat / bharat

'రబ్బర్​ స్టాంప్' రాజకీయం! పంజాబ్​ అధికారులకు కేజ్రీవాల్ ఆదేశాలా?

author img

By

Published : Apr 14, 2022, 6:18 PM IST

Punjab CM News: తాను లేకుండా దిల్లీ సీఎంతో పంజాబ్ ఉన్నతాధికారులు సమావేశం కావడాన్ని సమర్థించుకున్నారు భగవంత్​ మాన్. తానే వారిని పంపినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.

punjab-cm-bhagwant-mann
'రబ్బర్​ స్టాంప్ సీఎం' విమర్శలను తిప్పికొట్టిన భగవంత్ మాన్​

Bhagwant Mann News: పంజాబ్​ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటీవల దిల్లీకి వెళ్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్​తో సమావేశమయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లేకుండానే ఈ భేటీ జరగడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. పంజాబ్​లో రిమోట్​ కంట్రోల్​​ ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టాయి. భగవంత్​ మాన్​.. రబ్బర్​ స్టాంప్ సీఎం అని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యవహారంపై గురువారం జలంధర్​లో మీడియా సమావేశం నిర్వహించిన మాన్.. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. పంజాబ్​ అధికారులను తానే దిల్లీ సీఎం వద్దకు పంపినట్లు చెప్పారు. " శిక్షణ కోసం నేనే పంజాబ్ ఉన్నతాధికారులను కేజ్రీవాల్ వద్దకు పంపాను. గతంలోనూ వారు ట్రైనింగ్ కోసం గుజరాత్​, తమిళనాడు వెళ్లారు. పంజాబ్​ ప్రయోజనాల కోసం అధికారులను అవసరమైతే ఇజ్రాయెల్​కు కూడా పంపుతాం. రానున్న రోజుల్లో కూడా వారిని బంగాల్​, గుజరాత్​, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పంపుతాం. ఎక్కడ మంచి విషయం ఉన్నా తెలుసుకునుని పంజాబ్​​ ప్రజలకు కూడా దాన్ని ఉపయోగపడేలా చేస్తాం." అని మాన్ పేర్కొన్నారు.

Punjab News: పంజాబ్ ప్రజలకు త్వరలో శుభవార్త చెబుతునానని ఇటీవల మాన్ అన్నారు. ఆ విషయమేంటో ఏప్రిల్ 16న వెల్లడిస్తానని చెప్పారు. అది విన్నాక అధికారులను తరచూ ఇతర రాష్ట్రాలకు పంపాలని మీరే అంటారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన స్కాలర్​షిప్ కుంభకోణంలో నిందితులను ఊచలు లెక్కపెట్టిస్తాని మాన్​ స్పష్టం చేశారు. వారంతా జైలులో మెరుగైన సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు చేసుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. అలాగే పంజాబ్​ మంత్రుల కోసం ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయడం లేదని కూడా సీఎం స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు.

ఇదీ చదవండి: పది వేల కార్లు, బైక్​లు, విమానాలకు ఓనర్​ ఇతడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.