తెలంగాణ

telangana

నిండుకుండలా కిన్నెరసాని జలాశయం.. 405 అడుగులకు చేరిన నీటిమట్టం

By

Published : Sep 3, 2021, 12:01 PM IST

Updated : Sep 3, 2021, 12:50 PM IST

water level at Kinnerasani  reached 405 feet
నిండుకుండలా కిన్నెరసాని జలశయం ()

భద్రాద్రి జిల్లా పాల్వంచ కిన్నెరసానికి జలాశయానికి జలకళ వచ్చింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో ఉన్న మర్కోడు, గుండాల, అల్లపల్లి తదితర ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు లోతట్టు ప్రాంతమైన పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి వచ్చి చేరుతోంది.

నాలుగు రోజుల క్రితం వరకు కేవలం 200క్యూసెక్కుల ఇన్​ప్లో మాత్రమే ఉండగా ప్రస్తుతం 16 వేల క్యూసెక్కులకు చేరుకుంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ సామర్థ్యం 407 అడుగులు కాగా శుక్రవారం ఉదయం వరకు 405 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఇన్​ప్లో భారీగా పెరగడంతో కిన్నెరసాని ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక గేటు ఎత్తి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు.

నిండుకుండలా కిన్నెరసాని జలాశయం

పాల్వంచ,బూర్గంపాడు మండల గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తక్కువ ఎత్తు కలిగిన బ్రిడ్జీలు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కిన్నెరసాని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు.

ఇదీ చదవండి:LIVE UPDATES: భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం

Last Updated :Sep 3, 2021, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details