తెలంగాణ

telangana

యువకుడి విజ్ఞప్తికి స్పందించిన ప్రధాని కార్యాలయం

By

Published : Oct 14, 2020, 12:40 PM IST

ఉద్యోగం ఎలాగో ఇవ్వడం లేదు.. చనిపోవడానికికైనా అనుమతి ఇవ్వండని.. సింగరేణి దిలీప్ కుమార్ అనే నిరుద్యోగి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని కోరాడు. ఈ విషయమై పీఎంవో కార్యాలయం స్పందించింది. ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి లేదంటూ ట్విటర్ ద్వారా సందేశం పంపింది.

The Prime Minister's Office responded to the young man's request
యువకుడి విజ్ఞప్తికి స్పందించిన ప్రధాని కార్యాలయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి భూ నిర్వాసితులు తమకు జీవో నెంబర్ 34 ప్రకారం ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దిలీప్ కుమార్ అనే నిరుద్యోగి బాధపడ్డాడు. కనీసం ఆత్మహత్యకైనా అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని కోరాడు. ఉద్యోగాలు రాక తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నామని గోడు వెళ్లబోసుకున్నాడు.

యువకుడి విజ్ఞప్తికి స్పందించిన ప్రధాని కార్యాలయం

ఈ విషయంపై స్పందించిన పీఎంవో కార్యాలయం ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి లేదంటూ ట్విటర్ ద్వారా సందేశం పంపిందని బాధితుడు తెలిపాడు. న్యాయస్థానాలు, ఐటీడీఏ పీఓ నుంచి తము పూర్తి స్థాయిలో ఉద్యోగాలకు అర్హత ఉందని తేల్చినట్లు పేర్కొన్నాడు. సింగరేణి సంస్థ పుట్టినిల్లయిన ఇల్లందు ప్రాంతానికి చెందిన తమ పట్ల వివక్ష చూపుతోందని దిలీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవీచూడండి:జీహెచ్‌ఎంసీలో వర్ష బీభత్సం... అత్యవసర సేవల నంబర్లు ఇవే

ABOUT THE AUTHOR

...view details