తెలంగాణ

telangana

అకాల వర్షంతో మరింత కష్టాల్లో మొక్కజొన్న రైతులు

By

Published : Apr 27, 2021, 10:56 PM IST

అకాల వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురవడం వల్ల ఆరబెట్టుకున్న పంట తడిసి ముద్దయింది. వర్షం తగ్గిన తర్వాత మొక్కజొన్నను నీటిలో ఏరుకునే దుస్థితి ఏర్పడింది.

rains in yellandu, Bhadradri Kottagudem district,
rains in yellandu, Bhadradri Kottagudem district,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అకాల వర్షాలు మొక్కజొన్న రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. చాలా ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. మండలంలోని పలు గ్రామాల్లో గంటసేపు వర్షం పడింది. ఇప్పటికే కొనుగోళ్లపై స్పష్టత లేక మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరబెట్టుకున్న పంట కాస్తా అకాల వర్షాల ధాటికి తడిసిపోయింది.

రహదారుల మీద పంటను ఆరబెట్టుకున్న రైతులు.. వర్షం తగ్గిన తర్వాత నీటిలో ఏరుకునే దుస్థితి ఎదురైంది. రైతులను ఆదుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

ABOUT THE AUTHOR

...view details