తెలంగాణ

telangana

ఈ నెల 28న భద్రాద్రికి రాష్ట్రపతి.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్​

By

Published : Dec 25, 2022, 2:13 PM IST

Draupadi Murmu Bhadradri Tour : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఈ నెల 28న భద్రాద్రి రామయ్యను దర్శించనున్నారు. ఆమె పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్​ అనుదీప్​ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

President Draupadi Murmu
President Draupadi Murmu

Draupadi Murmu Bhadradri Tour : భద్రాద్రిలో ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను పరిశీలించారు. ముందుగా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో రాష్ట్రపతి విశ్రాంతికి ఏర్పాట్లు చేశారు. సారపాక నుంచి భద్రాచలం వరకు వచ్చే రహదారి ప్రాంతాన్ని.. భద్రాచలం ఆలయంలో ప్రతి భాగాన్ని పర్యవేక్షించారు. ప్రదేశాలన్నీ విశాలంగా ఉండేలా.. భద్రత దృష్ట్యా ప్రజలంతా పోలీసులకు అధికారులకు సహకరించాలని కోరారు.

మరోవైపు రాష్ట్రపతి రాక సందర్భంగా యాదాద్రిలోనూ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కొండ కింద యాగ స్థలంలో హెలిప్యాడ్ ప్రాంగణాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు పరిశీలించారు.
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details