తెలంగాణ

telangana

నేటి నుంచి భద్రాద్రిలో అమ్మవారి శరన్నవరాత్రులు

By

Published : Oct 17, 2020, 7:40 AM IST

Updated : Oct 17, 2020, 9:33 AM IST

మహిషాసురమర్దిని, అన్నపూర్ణాదేవి, సకల లోకాలనేలే లలితా పరమేశ్వర దేవి ఇలా అమ్మవారిని ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుస్తూ.. కొలుస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏటా దసరా రోజుల్లో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని అమ్మవారి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ప్రారంభం కానున్నాయి.

badradri
నేటి నుంచి భద్రాద్రిలో అమ్మవారి శరన్నవరాత్రులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అమ్మవారి ఆలయంలో నేటితో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని లక్ష్మీ తయారు అమ్మవారు రోజుకు.. ఒక రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దశావతారాలలో అమ్మవారు భక్తులకు కనిపించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి 7 గంటల నుంచి 8 గంటల వరకు పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు.

అనంతరం అమ్మవారి అలంకార దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు మహానివేదన భోగభాగ్యం నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి మహిళా భక్తుల సమక్షంలో లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు దర్భారు సేవ... 7 గంటలకు మహా మంత్రపుష్పం నిర్వహిస్తారు. ఎనిమిది గంటలకు తిరువీధి సేవ, 9 గంటలకు పవళింపు సేవ నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను కరోనా మహమ్మారి దృష్టిలో ఉంచుకొని పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా

  • మొదటిరోజు 17న అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారం
  • 2వ రోజు 18న సంతాన లక్ష్మి అలంకారం
  • 3రోజు 19న గజలక్ష్మి అలంకారం
  • 4వ రోజు 20న ధనలక్ష్మి అలంకారం
  • 5వ రోజు 21న ధాన్య లక్ష్మి అలంకారం
  • 6వ రోజు 22న విజయలక్ష్మి అలంకారం
  • 7వ రోజు 23న ఐశ్వర్య లక్ష్మి అలంకారం
  • 8వ రోజు 24న వీర లక్ష్మీ అలంకారం
  • 9వ రోజు 25న మహాలక్ష్మి అలంకారం
  • 10వరోజు 26న నిజరూప అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Last Updated :Oct 17, 2020, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details