భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలని కోరుతూ.. అఖిలపక్ష నాయకులు ధర్నా చేశారు.
క్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలని అఖిలపక్షం ఆందోళన
మణుగూరు వందపడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలని కోరుతూ.. అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిని క్వారంటైన్ కేంద్రంగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు.
క్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలి: అఖిలపక్ష నాయకులు
ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన వంద పడకల ఆసుపత్రిని క్వారంటైన్ కేంద్రంగా మార్చడం సరికాదన్నారు. వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు.