తెలంగాణ

telangana

హోల్డ్​లో వినోద్​ కాంస్యం.. ఏం జరుగుతోంది?

By

Published : Aug 29, 2021, 8:35 PM IST

Updated : Aug 29, 2021, 10:00 PM IST

పారాలింపిక్స్​లో ఆదివారం జరిగిన డిస్కస్​ త్రో పోటీలో కాంస్య పతకం విజేత ఫలితం హోల్డ్​లో పడింది. భారత్​కు చెందిన పారా అథ్లెట్ వినోద్(Vinod Kumar Discus throw)​ 'డిసెబిలిటీ క్లాసిఫికేషన్​'పై సందేహాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

vinod kumar
వినోద్ కుమార్

టోక్యో పారాలింపిక్స్​లో ఆదివారం జరిగిన డిస్కస్​ త్రో పోటీలో వినోద్​ కాంస్యం(Vinod Kumar Discus throw) గెలిచినట్లు తొలుత ఖరారైనప్పటికీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ పతకాన్ని హోల్డ్​లో ఉంచినట్లు తెలుస్తోంది. వినోద్​ డిసేబిలిటీ క్లాసిఫికేషన్​పై(Disability Classification) ఓ దేశం సందేహాలు లేవనెత్తి, ఫిర్యాదు చేసిన కారణంగా.. పతకాన్ని హోల్డ్​లో పెట్టారు అధికారులు.

వినోద్(41).. 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. పోలాండ్‌కు చెందిన పీయోటర్‌ కోసెవిక్జ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా.. క్రోయేషియాకు చెందిన వెలిమిర్‌ సాండర్‌ 19.98 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు.

అయితే.. ఎఫ్52 కేటగిరీలో వినోద్​(Vinod Kumar Paralympics) ఎంపికపై అనుమానం వ్యక్తం చేశారు కొందరు పోటీదారులు. వాస్తవానికి.. ఆగస్టు 22నే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తైంది. అయినప్పటికీ పోటీదారుల అనుమానం దేనిపై అన్న విషయం మీద స్పష్టత లేదు. ఆగస్టు 30 సాయంత్రంలోపు వినోద్​ సాధించిన కాంస్య పతకంపై స్పష్టత రానుంది.

బలహీనమైన కండరాల శక్తి, పరిమిత స్థాయి కదలిక, అవయవ లోపం లేదా కాళ్ల పొడవులో వ్యత్యాసం, వెన్నముక గాయంతో ఉన్న వారికి ఎఫ్​52 పోటీలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.

ఇదీ చదవండి:పారాలింపిక్స్​లో భారత్​కు మరో పతకం.. వినోద్​కు కాంస్యం

Last Updated : Aug 29, 2021, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details