తెలంగాణ

telangana

హోరాహోరీ మ్యాచ్​లో పరాజయం.. హాకీ వరల్డ్‌ కప్‌ నుంచి భారత్‌ ఔట్​

By

Published : Jan 22, 2023, 10:06 PM IST

Updated : Jan 22, 2023, 10:30 PM IST

హాకీ వరల్డ్‌ కప్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది భారత్​. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో టీమ్​ఇండియా అద్భుతంగా పోరాడింది. కానీ, ఆఖర్లో ప్రత్యర్థి కూడా పుంజుకోవడం వల్ల భారత్‌ ఓటమి చవిచూసింది.

new-zealand-defeat-india-in-a-penalty-shootout in hockey world cup 2023
new-zealand-defeat-india-in-a-penalty-shootout in hockey world cup 2023

హాకీ వరల్డ్‌ కప్‌ నుంచి భారత్‌ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్‌ అద్భుతంగా పోరాడింది. కానీ, ఆఖర్లో ప్రత్యర్థి కూడా పుంజుకోవడంతో భారత్‌ ఓటమి చవిచూసింది. షూటౌట్‌ రౌండ్‌లో 5-4 తేడాతో న్యూజిలాండ్‌ గెలుపొందింది. దీంతో క్వార్టర్‌ చేరకుండానే ప్రపంచకప్‌ నుంచి భారత జట్టు వెనుదిరిగింది.

ఆదివారం జరిగిన మ్యాచ్‌ తొలి క్వార్టర్స్‌లో ఇరుజట్లు ఒక్క గోల్‌ కూడా చేయలేదు. రెండో క్వార్టర్స్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే 17వ నిమిషంలో భారత ఆటగాడు లలిత్‌ కుమార్‌ తొలి గోల్‌ కొట్టి ఖాతా తెరిచాడు. అనంతరం మ్యాచ్‌ 24వ నిమిషంలో సుఖ్‌జిత్‌ రెండో గోల్‌ కొట్టాడు. మ్యాచ్‌ 28వ నిమిషంలో సామ్‌ లేన్‌ గోల్‌ కొట్టి న్యూజిలాండ్‌కు తొలి గోల్ అందించాడు. మ్యాచ్‌ సగం సమయం ముగిసేసరికి భారత్‌ 1 గోల్‌ అధిక్యంలో ఉంది. తర్వాత మ్యాచ్‌ 39వ నిమిషంలో మూడో క్వార్టర్స్‌లో వరుణ్‌ కుమార్‌ మూడో గోల్‌ కొట్టగా.. 53వ నిమిషంలో న్యూజిలాండ్‌ మరో గోల్‌ కొట్టడంతో ఇరుజట్ల స్కోర్లు సమం కాగా షూటౌట్ రౌండ్‌కు దారితీసింది.

షూటౌట్‌ సాగిందిలా..

  • షూటౌట్‌ రౌండ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ తొలి గోల్‌ కొట్టగా... న్యూజిలాండ్‌కు రస్సెల్‌ గోల్‌ అందించాడు.
  • భారత్‌ తరఫున రాజ్‌కుమార్‌ పాల్‌ రెండో గోల్‌ వేయగా... న్యూజిలాండ్‌ తరఫున ఫిండ్లే గోల్‌ కొట్టాడు.
  • మూడో గోల్ వేయడానికి వచ్చిన భారత ఆటగాడు అభిషేక్‌ గోల్‌ మిస్‌ చేశాడు. న్యూజిలాండ్ ప్లేయర్‌ గోల్‌ కొట్టాడు. దీంతో 2-3తో భారత్‌ వెనబడింది. ఆ తర్వాత భారత తరఫున షంషేర్‌, న్యూజిలాండ్‌ తరఫున సామ్‌ లేన్‌ గోల్‌ మిస్‌ చేశారు.
  • తర్వాత సుఖ్‌జిత్ భారత్‌కు మూడో గోల్‌ అందించాడు. న్యూజిలాండ్‌ తరఫున సమీ హిహ గోల్‌ మిస్‌ చేయడంతో ఇరుజట్ల స్కోర్లు 3-3తో సమం అయ్యాయి.
  • అనంతరం న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కొట్టిన గోల్‌ను పట్టే క్రమంలో గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో పాఠక్‌ గోల్‌ కీపర్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు ఫిండ్లే గోల్‌ కొట్టి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తర్వాత రాజ్‌కుమార్‌ మరో గోల్‌ కొట్టి స్కోర్లను సమం చేశాడు.
  • భారత తరఫున సుఖ్‌జిత్‌ ఐదో గోల్ కొట్టడంలో విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు లేన్‌ ఐదో గోల్‌ కొట్టడంతో భారత్‌ పరాజయం పాలై ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • ఇవీ చదవండి:
  • 'భవిష్యత్​లో మూడు జట్లుగా టీమ్​ఇండియా'.. మేనేజ్​మెంట్​కు కపిల్​ చురకలు!
  • 'ఆ యువ బ్యాటర్‌ రోహిత్ శర్మకు 'మినీ వెర్షన్‌'లా ఉన్నాడు'
Last Updated : Jan 22, 2023, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details