ETV Bharat / sports

'ఆ యువ బ్యాటర్‌ రోహిత్ శర్మకు 'మినీ వెర్షన్‌'లా ఉన్నాడు'

author img

By

Published : Jan 22, 2023, 9:25 PM IST

ramiz-raja-lavishes-praise-on-india-batter gill
ramiz-raja-lavishes-praise-on-india-batter gill

భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వన్డేల్లో అత్యంత చిన్న వయస్సులోనే డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో గిల్‌ ప్రదర్శనను పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా ప్రశంసలు కురిపించాడు.

టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనపై ఎప్పుడూ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా అవాకులు చెవాకులు పేలుతుండేవాడు. అయితే తొలిసారి భారత యువ క్రికెటర్‌పై అభినందనలు కురిపించాడు. కివీస్‌పై రెండు వన్డేల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ను రమీజ్‌ రజా ప్రశంసించాడు. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మినీ వెర్షన్‌లా ఉన్నాడని కొనియాడాడు.

"శుభ్‌మన్‌ గిల్‌ను చూస్తే మినీ రోహిత్‌ను చూసినట్లు ఉంది. బ్యాటింగ్‌లో అతడి నైపుణ్యం చాలా బాగుంది. పరిస్థితికి తగ్గట్టుగా ఆడుతున్నాడు. కాలక్రమేణా మరింత మెరుగవుతాడు. అంతేకానీ, ఇంకేమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవలే గిల్‌ ద్విశతకం బాదాడు. కివీస్‌తో సిరీస్‌లో భారత బ్యాటింగ్‌ అద్భుతంగా సాగుతోంది. ఎందుకంటే ఆ జట్టులో రోహిత్ శర్మ వంటి టాప్‌ బ్యాటర్ ఉన్నాడు. హుక్‌, పుల్‌ షాట్లను కొట్టడంలో దిట్ట. అందుకే రెండో వన్డేలో 108 పరుగుల లక్ష్య ఛేదన సులువైంది"

"భారత బ్యాటర్లు చేయాల్సిన అంశం ఒకటుంది.. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌.. ఎందుకంటే వారి ఫ్రంట్‌ ఫుట్‌ బ్యాటింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. బ్యాక్‌ ఫుట్‌ నుంచి కొట్టడం చాలా సులభం. కానీ బంతి పైకి వచ్చినప్పుడు డిఫెన్స్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే కాస్త లోపం ఉందనిపిస్తోంది. టెస్టు క్రికెట్, వన్డేల్లో భారత్‌ పునరుజ్జీవం పొందాలంటే బౌలింగే ఆధారం. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ జట్టు బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది" అని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.