తెలంగాణ

telangana

ప్రపంచ ఛాంపియన్​షిప్​​ క్వార్టర్స్​లో మేరీకోమ్​

By

Published : Oct 8, 2019, 5:45 PM IST

రష్యాలోని ఉలాన్-ఉద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్​షిప్​​లో సత్తా చాటుతోంది భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్. ప్రీ క్వార్టర్స్​లో థాయన్​లాండ్​ క్రీడాకారిణి జుటామస్​పై నెగ్గి క్వార్టర్స్​కు చేరింది.

మేరీ కోమ్​

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్ మేరీకోమ్ దూసుకెళ్తోంది. రష్యాలోని ఉలాన్-ఉద్​ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో క్వార్టర్స్​కు చేరిందీ స్టార్​ క్రీడాకారిణి. 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆమె.... థాయ్​లాండ్​కు చెందిన జుటామస్ జిట్​పాంగ్​పై ప్రీక్వార్టర్స్​లో నెగ్గింది.

మంగళవారం జరిగిన మ్యాచ్​లో 5-0 తేడాతో థాయ్​ క్రీడాకారిణిపై గెలిచింది మేరీ. తొలి రౌండ్​ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన భారత బాక్సర్... చివరి వరకు అదే జోరు కొనసాగించింది.

ఇప్పటికే 48 కేజీల విభాగంలో భారత బాక్సర్ మంజురాణి క్వార్టర్​ ఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్స్​లో సెడెనో(వెనుజువెలా)ను ఓడించింది.

ఇదీ చదవండి: జహీర్​పై హార్దిక్​ వెటకారం.​.. ఫ్యాన్స్​ ఆగ్రహం​!

ABOUT THE AUTHOR

...view details