తెలంగాణ

telangana

ఖేల్​రత్న పేరు మార్పు.. ఇకపై ధ్యాన్​చంద్ ఖేల్​రత్నగా!

By

Published : Aug 6, 2021, 12:36 PM IST

Updated : Aug 6, 2021, 1:08 PM IST

Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award!
ఖేల్​రత్న పేరు మార్పు.. ఇకపై ధ్యాన్​చంద్ ఖేల్​రత్నగా! ()

12:31 August 06

క్రీడాకారులకు ప్రదానం చేసే రాజీవ్ గాంధీ ఖేల్​రత్న పురస్కారానికి ఉన్న పేరును మార్చనున్నట్లు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల విజ్ఞప్తుల మేరకు.. ఇకపై రాజీవ్ గాంధీ ఖేల్​రత్న పేరును మేజర్ ధ్యాన్​చంద్ ఖేల్​రత్న అవార్డుగా మార్పు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  

"ఖేల్​రత్న అవార్డుకు మేజర్​ ధ్యాన్​చంద్​ పేరు పెట్టాలని అనేకమంది నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయి. వారి అభిప్రాయాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. ఖేల్​రత్న పురస్కారానికి మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న అవార్డుగా ఇకపై పిలుస్తారు. జై హింద్​!" అని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు. 

Last Updated :Aug 6, 2021, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details