ETV Bharat / business

త్వరగా రిటైర్ కావాలని అనుకుంటున్నారా? 'FIRE స్ట్రాటజీ'పై ఓ లుక్కేయండి! - FIRE Strategy

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 5:16 PM IST

30:30:30:10 investment rule
FIRE Strategy (ANI)

FIRE Strategy : మీరు త్వరగా రిటైర్ అయ్యి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఫైర్​ (FIRE) స్ట్రాటజీ ఉపయోగించి మీ పదవీ విరమణ నాటికి మంచి (కార్పస్​) ఆర్థిక నిధిని ఏర్పాటుచేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

FIRE Strategy : ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో చెప్పలేకపోతున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని సక్రమ పద్ధతుల్లో మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం సరైన బడ్జెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ బడ్జెట్లో దైనందిన ఖర్చులు, పొదుపు, మదుపు, పదవీ విరమణ ప్రణాళికలకు అవసరైన కేటాయింపులు చేసుకోవాలి. అలాగే కచ్చితంగా అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్​లో మీకు ఆర్థిక భద్రత కలుగుతుంది.

ప్రస్తుతం వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు కూడా మితిమీరిపోతున్నాయి. అందుకే ఇప్పటి నుంచే పదవీ విరమణ ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే, ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా పని చేసేటప్పుడు సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోకుంటే, పదవీ విరమణ తరువాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకోవాలి. ఇందుకోసం ఉపయోగపడేదే ఫైర్ (FIRE) స్ట్రాటజీ.

What Is FIRE Strategy?
ఫైర్ స్ట్రాటజీ - 30:30:30:10 సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది. ఇది మీ ఆదాయ నిర్వహణ, పెన్షన్ ప్లానింగ్​ రెండింటికీ వర్తిస్తుంది. ఫైర్ స్ట్రాటజీ ప్రకారం, మీ మొత్తం ఆదాయంలో 30 శాతాన్ని రోజువారీ ఖర్చులకు కేటాయించాలి. మరో 30 శాతాన్ని పెట్టుబడులకు, ఇంకో 30 శాతాన్ని పదవీ విరమణ ప్రణాళికకు కేటాయించాలి. మిగిలిన 10 శాతం డబ్బుతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా నెరవేరుతాయి.

మీ రోజువారీ అవసరాలను, దీర్ఘకాలిక లక్ష్యాలను సమతుల్యం చేసుకోవడానికి ఈ ఫైర్​ స్ట్రాటజీ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫైర్ స్ట్రాటజీ వల్ల మీ ఆర్థిక అలవాట్లు మారుతాయి. మీ ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది.

నో రిస్క్!
పొదుపు, పెట్టుబడుల విషయంలోనూ 30:30:30:10 నియమాన్ని పాటించాలి. మీరు పెట్టుబడుల కోసం కేటాయించిన డబ్బులో 30 శాతాన్ని బాండ్​ల్లో, 30 శాతాన్ని రియల్​ ఎస్టేట్ ప్రోపర్టీల్లో, 30 శాతాన్ని షేర్​ మార్కెట్లో పెట్టాలి. మిగిలిన 10 శాతం డబ్బును నగదు రూపంలో ఉంచుకోవాలి. లేదా సులువుగా నగదుగా మార్చుకునే మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్ చేయడం వల్ల రిస్క్ (నష్టభయం) తగ్గుతుంది. అప్పుడే తాత్కాలికంగా వచ్చే ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. భవిష్యత్​లో మంచి ఆర్థిక లబ్ధి పొందగలుగుతారు.

రోజురోజుకూ జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో వ్యక్తుల పొదుపు, పెట్టుబడులపై దాని ప్రభావం ఎక్కువగా పడుతోంది. దీనితో చాలా మధ్యలోనే ఫైర్ స్ట్రాటజీ నుంచి విరమిస్తున్నారు. కానీ ఇలా ఎప్పటికీ చేయకూడదు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడడం సహజమే. అందుకే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.

అందరికీ ఒకటే రూల్​!
ఆర్థిక విషయాల్లో అందరికీ ఒకే నియమం అనేది ఎప్పుడూ వర్తించదు. ఫైర్ స్ట్రాటజీ విషయంలోనూ అంతే. ఈ ఫైర్ స్ట్రాటజీ ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని చెప్పలేము. వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు మీ పొదుపు, మదుపులను ప్రభావితం చేస్తూ ఉంటాయి. కనుక మీ రిస్క్ టాలరెన్స్ (నష్టాన్ని భరించే శక్తి), ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీకు సరిపడే వ్యూహాన్ని అనుసరించాలి. ఇలాంటి వ్యూహాలు పాటించే ముందు, కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి.

రెగ్యులర్ ఇన్​కం + ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా? SWP స్ట్రాటజీ ఫాలో అవ్వండి! - Systematic Withdrawal Plan

మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలా? రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్​-5 ఆప్షన్స్​ ఇవే! - Best Sports Bike

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.