ETV Bharat / sports

లఖ్​నవూపై 'నరైన్​' విధ్వంసం- ఖాతాలో మరో రికార్డ్ - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 9:56 PM IST

Sunil Narine IPL 2024
Sunil Narine IPL 2024 (Source: ANI)

Sunil Narine IPL 2024: కోల్​కతా నైట్​రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో అదరగొడుతున్నాడు. తాజాగా లఖ్​నవూపై భారీ ఇన్నింగ్స్​తో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో నరైన్ అరుదైన ఘనత సాధించాడు.

Sunil Narine IPL 2024: కోల్​కతా నైట్​రైడర్స్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ లఖ్​నవూపై విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్​లో నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే బౌండరీలే లక్ష్యంగా లఖ్​​నవూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 228.57 స్ట్రైక్​ రేట్​తో 39 బంతుల్లో 81 పరుగులతో సత్తా చాటాడు. అందులో 6 ఫోర్లు, 7 సిక్స్​లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నరైన్ ఐపీఎల్​లో మరో రికార్డ్ అందుకున్నాడు.

నరైన్ అరుదైన రికార్డ్: ఆల్​రౌండర్ సునీల్ నరైన్ ఐపీఎల్​లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​లో అటు బ్యాటింగ్​లో 1500+ పరుగులు, ఇటు బౌలింగ్​లో 150+ వికెట్లు తీసిన మూడో ఆల్​రౌండర్​గా నిలిచాడు. నరైన్ ప్రస్తుతం ఐపీఎల్ కెరీర్​లో 1507 పరుగులు, 176 వికెట్లు ఉన్నాయి. నరైన్ కంటే ముందు​ రవీంద్ర జడేజా (2894 పరుగులు, 160 వికెట్లు, డ్వేన్ బ్రావో (1560 పరుగులు, 183 వికెట్లు) ఈ ఘనత సాధించారు.

ఇక ప్రస్తుత సీజన్​లో నరైన్ కేకేఆర్​కు కీలక బ్యాటర్​గా మారాడు. మెరుపు ఇన్నింగ్స్​తో కోల్​కతాకు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్​లో 11 మ్యాచ్​లు ఆడిన నరైన్ 183 స్ట్రైక్​ రేట్​, 41.91 సగటున ఇప్పటివరకు 461 పరుగులు నమోదు చేశాడు. అందులో 46 ఫోర్లు, 32 సిక్స్​లు బాదాడు. ఇక అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతాకు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (32 పరుగులు), నరైన్ (81 పరుగులు) మంచి ఆరంభం ఇచ్చారు. వన్​డౌన్​లో వచ్చిన రఘువంశీ (32 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. ఇక అండ్రీ రస్సెల్ (12), రింకూ సింగ్ (16), శ్రేయస్ అయ్యర్ (23) ఆకట్టుకోలేదు. వీళ్లలో ఒకరైనా క్రీజులో కుదురుకుంటే స్కోర్ 250 దాటేదే. ఇక చివర్లో రమన్​దీప్ సింగ్ (*25 పరుగులు) రాణించండం వల్ల 235 స్కోర్ దక్కింది. లఖ్​నవూ బౌలర్లలో నవీన్​ ఉల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుద్వీర్ సింగ్ చరక్ తలో వికెట్ దక్కించుకున్నారు.

'అది జరగని పని, దానికి డోర్స్ క్లోజ్'- సునీల్ నరైన్ కామెంట్స్! - Sunil Narine T20 World Cup

500 క్లబ్‌లోకి సునీల్ నరైన్ - ఈ సీజన్‌లో తొలి జట్టుగా కోల్‌కతా ఘనత - IPL 2024 RCB VS KKR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.