తెలంగాణ

telangana

మహిళల ప్రీమియర్​ లీగ్​ తొలి మ్యాచ్​.. టాస్​ గెలిచిన గుజరాత్​

By

Published : Mar 4, 2023, 7:39 PM IST

Updated : Mar 4, 2023, 7:56 PM IST

WPL 2023: మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా తొలి మ్యాచ్​లో గుజరాత్​ జెయింట్స్​​ టాస్​ గెలుచుకుని బౌలింగ్​ ఎంచుకుంది. ప్రత్యర్థి ముంబయికి బ్యాటింగ్​​ అప్పగించింది.

wpl 2023 mumbai indians vs gujarat giants match
wpl 2023 mumbai indians vs gujarat giants match

WPL 2023: మహిళల ప్రీమియర్​ లీగ్​ తొలి ఎడిషన్​ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్​లో గుజరాత్​ జెయింట్స్​​ టాస్​ గెలుచుకుని బౌలింగ్​ ఎంచుకుంది. ప్రత్యర్థి ముంబయికి బ్యాటింగ్​​ అప్పగించింది. గుజరాత్‌ జెయింట్స్‌కు బెత్‌ మూనీ సారథ్యం వహిస్తుండగా.. ముంబయి ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వం వహిస్తోంది.

ముంబయి ఇండియన్స్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్‌, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత.

గుజరాత్‌ జెయింట్స్‌: బెత్‌ మూనీ (కెప్టెన్‌), యాష్లే గార్డ్‌నర్‌,జార్జియా వేర్‌హమ్‌,స్నేహ్‌ రాణా, అనాబెల్‌ సదర్లాండ్‌, కిమ్‌ గార్త్‌, సోఫియా డన్‌క్లే, సుష్మా వర్మ, తనూజ కన్వర్‌, హర్లీన్‌ డియోల్‌, అశ్వని కుమారి, హేమలత, మాన్సి జోషి, మోనిక పటేల్‌, సబ్బినేని మేఘన, హర్లీ గాల, పరుణిక సిసోడియా, షబ్నమ్‌ షకీల్‌

కాగా, శనివారం సాయంత్రం గ్రాండ్‌గా డబ్ల్యూపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లు కియరా అడ్వాణీ, కృతి సనన్‌ సహా టాప్‌ స్టార్స్‌ అంతా సందడి చేశారు. ఆ తర్వాత టాప్‌ సింగర్‌ ఏపీ థిల్లాన్‌తో మ్యూజికల్‌ చాట్‌బస్టర్స్‌ ఏర్పాటు చేశారు. ప్రముఖ సింగర్​ శంకర్​ మహదేవన్​ డబ్ల్యూపీఎల్​ యాంథమ్​ను ఆలపించారు.

కియారా, కృతి, ఏపీ థిల్లాన్​
డబ్ల్యూపీఎల్​ కప్​తో ఐదు టీమ్​ల కెప్టెన్లు
Last Updated : Mar 4, 2023, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details