తెలంగాణ

telangana

విరాట్​ బర్త్​ డే మేనియా - లండన్​ నుంచి ఈడెన్​ గార్డెన్​కు ఫ్యాన్స్​​ - 20 రెట్లు ఎక్కువకు టికెట్లు కొనుగోలు!

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 3:54 PM IST

Updated : Nov 5, 2023, 4:24 PM IST

Virat Kohli Birthday Wishes : 2023 ప్రపంచకప్​లో భారత్​ - సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈరోజు (నవంబర్ ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్​డే కావడం వల్ల టీమ్ఇండియా ఫ్యాన్స్​కు ఈ మ్యాచ్​ మరింత స్పెషల్​గా మారింది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు, ప్రముఖులు, ఫ్యాన్స్​ విరాట్​కు శుభాకాంక్షలు తెలిపారు.

Virat Kohli Birthday Wishes
Virat Kohli Birthday Wishes

Virat Kohli Birthday Wishes :2023 వరల్డ్​కప్​లో భాగంగా భారత్ కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతోంది. అయితే ఈరోజు (నవంబర్ 5) భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్​డే కావడం వల్ల.. టీమ్ఇండియా ఫ్యాన్స్​కు ఈ మ్యాచ్​ మరింత స్పెషల్​గా మారింది. ఈ క్రమంలో రన్ మషీన్​ విరాట్​కు లక్షలాది ఫ్యాన్స్ వినూత్న రీతిలో బర్త్​ డే విషెస్ తెలుపుతున్నారు.

విరాట్​కు చిన్నారుల విషెస్.. మ్యాచ్​ చూసేందుకు స్టేడియానికి వచ్చిన క్రౌడ్.. ఫ్లెక్స్​లు, బ్యానర్​లు, ప్లకార్డులతో స్టేడియంలో సందడి చేస్తున్నారు. అయితే మ్యాచ్​కు ముందు విరాట్ గ్రౌండ్​లో ఉండగా.. చిన్నారులు హుషారుగా అతడి వద్దకు వెళ్లారు. విరాట్​ను చుట్టుముట్టి అతడికి షేక్​హ్యాండ్​ ఇస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జాతీయ గీతం ఆలపించిన తర్వాత విరాట్ డగౌట్​ వైపు నడుస్తుండగా.. బాల్​ బాయ్ పరిగెత్తుకుంటూ అతడి వద్దకు వచ్చాడు. విరాట్​కు శుభాకాంక్షలు తెలిపి.. అతడి కాళ్లకు నమస్కరించాడు.

లండన్​ నుంచి సౌతాఫ్రికా ఫ్యాన్స్.. ​ఈడెన్ గార్డెన్స్​లో ఆదివారం జరగుతున్న మ్యాచ్​ చూసేందుకు.. ముగ్గురు సౌతాఫ్రికన్లు లండన్​ నుంచి భారత్ వచ్చారు. ఈ మ్యాచ్​ను లైవ్​లో చూసేందుకు.. టికెట్​ను దాదాపు 20 రేట్లు ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేసినట్టు వారు ఈటీవీ భారత్​తో చెప్పారు. "మ్యాచ్ చూసేందుకు భారత్​కు వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్​డే అని తెలిసింది. ప్రపంచంలో ఉన్న విరాట్ అభిమానుల్లో నేనూ ఒకడిని. అతడి ఆట అద్భుతం. అయితే మా దేశం (సౌతాఫ్రికా) ఈ టోర్నీలో బాగా ఆడుతోంది. అందుకే వారికి సపోర్ట్​ చేసేందుకు ఇక్కడికి వచ్చాం." అని అన్నాడు

డివిలియర్స్ - విరాట్ బాండింగ్.. మ్యాచ్​కు ముందు విరాట్​ను సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ డివిలియర్స్ కలిశాడు. అతడికి బర్త్ డే విషెల్ తెలిపి హగ్ చేసుకున్నాడు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా.. చాలా రోజుల తర్వాత వీరిద్దరు కలవడం చూసి ఫుల్ ఖుషి అయ్యారు.

48 కటౌట్లతో విషెస్.. విరాట్ పుట్టినరోజు సందర్భంగా కోల్​కతా ఫ్యాన్స్​ అతడికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ ఇప్పటివరకు వన్డేల్లో సాధించిన 48 సెంచరీలకు సంబంధించి.. కోల్​కతా రెడ్​ రోడ్​ మార్గం గుండా కటౌట్లు ఏర్పాటు చేశారు.

7అడుగుల ఎత్తు, 5టన్నుల ఇసుక- విరాట్​ కోహ్లీ సైకత శిల్పం అదుర్స్​!

భారత్​ X దక్షిణాఫ్రికా మ్యాచ్​ టికెట్ల 'బ్లాక్​ దందా'.. వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐకి బంగాల్​ పోలీసుల నోటీసులు!

Last Updated : Nov 5, 2023, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details