తెలంగాణ

telangana

Tilak Varma ODI World Cup 2023 : 'తిలక్​ను వరల్డ్ కప్​లో ఆడించండి'.. బీసీసీఐకి ఫ్యాన్స్ బిగ్​ రిక్వెస్ట్!

By

Published : Aug 9, 2023, 1:14 PM IST

Tilak Varma ODI World Cup 2023 : టీమ్​ఇండియా యువ సంచలనం తిలక్​ వర్మను.. త్వరలో జరగబోయే వరల్డ్​ కప్​ జట్టులో తీసుకోవాలని ఫ్యాన్స్​ డిమాండ్​ చేస్తున్నారు. యువరాజ్​ సింగ్​లా తిలక్​ వర్మ.. కీలక పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడుతున్నారు.

Tilak Varma ODI World Cup 2023
Tilak Varma

Tilak Varma ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్​ కోసం క్రికెట్​ అభిమానలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సొంతగడ్డపై ఈ సారి భారత్​.. వరల్డ్​ కప్​ఆడనుంది. 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్‌ను గెలుపొందిన టీమ్​ఇండియా.. ఈసారి కూడా కప్ కొట్టాలనే కసితో ఉంది. అయితే అప్పుడు వరల్డ్ కప్ గెలవడంలో భారత్​ బ్యాటర్​ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు.

అయితే ఈసారి భారత్.. వరల్డ్ కప్ గెలవాలంటే యువరాజ్ అలాంటి ఆటగాడు అవసరం. రిషబ్ పంత్ గాయపడటం వల్ల.. మిడిలార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ లేని కొరత కనిపిస్తోంది. కానీ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఓ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఒక్క వన్డే కూడా ఆడకపోయినప్పటికీ.. వెస్టిండీస్ గడ్డ మీద టీ20ల్లో అతడు రాణిస్తున్న తీరు ఆశలు రేపుతోంది. 2011 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ పోషించిన పాత్రను తిలక్ ఈసారి పోషించగలడని అభిమానులు నమ్మతున్నారు. అతడికి వరల్డ్ కప్ జట్టులో కచ్చితంగా చోటు ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

"తిలక్ ఏ పొజిషన్​లోనైనా బ్యాటింగ్ చేయగలడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగలడు. అతడో మంచి ఫీల్డర్. అంతే కాదు బౌలింగ్‌లోనూ ఓ చేయి వేయగలడు. కాబట్టి ఆస్ట్రేలియా ఎలాగైతే వరల్డ్ కప్‌కు కొందరు యువ ఆటగాళ్లను నేరుగా ఎంపిక చేసిందో.. బీసీసీఐ కూడా తిలక్‌ను ఎంపిక చేయాలి" అని ఫ్యాన్స్ కోరుతున్నారు.

వరల్డ్ కప్ ముందు కొత్త ఆటగాళ్లను ఆడించడం రిస్కే అవుతుంది. కానీ తిలక్ వర్మ దీనికి మినహాయింపు. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. వరల్డ్ కప్‌లో అతడు గేమ్ ఛేంజర్ అవుతాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ కప్ ఎలాగో స్వదేశంలోనే జరగనుంది కాబట్టి అనుభవం లేకపోవడం అనేది పెద్ద ఇబ్బంది కాదంటున్నారు.

Tilak Varma In World Cup 2023 : ఒకవేళ తిలక్ వర్మను వరల్డ్ కప్ ఆడించాలంటే.. అంతకు ముందు ఆసియా కప్ కోసం ఎంపిక చేయాలి. ఆసియా కప్‌లో సత్తా చాటితే.. వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. తిలక్‌ను ఒకవేళ ఈ వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోయినా.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో అతడు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వరల్డ్ కప్ తర్వాత తిలక్‌కు వన్డేల్లోనూ ఛాన్సులిస్తే.. అతడు భారత్‌కు కీలకంగా మారతాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Ind Vs Wi 3rd T20 : గంభీర్​ రికార్డు బ్రేక్​ చేసిన తిలక్​ వర్మ.. టీమ్​ఇండియా తొలి బౌలర్​గా కుల్​దీప్​!

Ind Vs Wi 3rd T20 : తిలక్ హాఫ్ సెంచరీ అడ్డుకున్న హార్దిక్ పాండ్య!.. ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details