ETV Bharat / sports

Ind Vs Wi 3rd T20 : గంభీర్​ రికార్డు బ్రేక్​ చేసిన తిలక్​ వర్మ.. టీమ్​ఇండియా తొలి బౌలర్​గా కుల్​దీప్​!

author img

By

Published : Aug 9, 2023, 11:24 AM IST

Ind Vs Wi 3rd T20 : వెస్టిండీస్​తో జరిగిన మూడో టీ20లో టీమ్​ఇండియా యంగ్​ బ్యాటర్​ తిలక్​ వర్మ, స్పిన్నర్​ కుల్​దీప్​ యాదవ్​ అరుదైన రికార్డులు సాధించారు. మాజీ దిగ్గజం గంభీర్​ రికార్డ్​ను తిలక్​ బ్రేక్​ చేయగా.. చాహల్​ పేరిట ఉన్న ఘనతను కుల్​దీప్​ బద్దలుగొట్టాడు.

tilak varma
tilak varma

Ind Vs Wi 3rd T20 Tilak Varma Records : టీమ్​ఇండియా యువ సంచలనం బ్యాట్​ తిలక్​ వర్మ.. వెస్టిండీస్​తో జరిగిన మూడో వన్డేలోనూ అదరగొట్టాడు. నాలుగో స్థానంలో క్రీజ్​లోకి వచ్చి ఈ హైదరాబాదీ.. 37 బంతుల్లో 49 పరుగులు సాధించి నాటౌట్​గా నిలిచాడు. కెరీర్​లో రెండో హాఫ్​ సెంచరీని త్రుటిలో చేజారినా.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

గంభీర్‌ రికార్డ్​ బ్రేక్​..
Tilak Varma Records : మూడో టీ20లో అదరగొట్టిన తిలక్​ వర్మ.. అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో టీమ్​ఇండియా తరఫున తొలి మూడు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్​ గంభీర్‌ను అధిగమించి.. స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్​లో 172 పరుగులతో దీపక్‌ హుడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అంతర్జాతీయ టీ20లలో తొలి మూడు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు వీరే..

  1. దీపక్‌ హుడా- 172 పరుగులు
  2. సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ- 139 పరుగులు
  3. గౌతమ్​ గంభీర్‌- 109 పరుగులు

మరో రికార్డు కూడా..
వెస్టిండీస్‌తో ఆడిన మూడు టీ20 మ్యాచ్‌లలో హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ చేసిన పరుగులు వరుసగా 39, 51, 49. మొత్తంగా 139 పరుగులు సాధించిన ఈ యువ ఆటగాడు.. తొలి మూడు ఇన్నింగ్స్‌లో 30కు పైగా పరుగులు చేసి.. సూర్యకుమార్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

కుల్​దీప్​ యాదవ్​ అరుదైన రికార్డు
Ind Vs Wi 3rd T20 Kuldeep Yadav : టీమ్​ఇండియా స్పిన్నర్​ కుల్​దీప్​ యాదవ్​ కూడా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లలోనే 50 వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు రికార్డులకెక్కాడు. గతంలో యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. .

భారత్ తరఫున టీ20లలో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్లు:

  • కుల్​దీప్​ యాదవ్ : 30 మ్యాచ్‌లు
  • యుజ్వేంద్ర చాహల్ : 34
  • జస్ప్రీత్ బుమ్రా : 41
  • రవిచంద్రన్ అశ్విన్ - 42
  • భువనేశ్వర్ కుమార్ - 50

Surya Kumar Yadav T20 Records : విండీస్​పై చెలరేగిన సూర్య.. దెబ్బకు ఆ ముగ్గురి రికార్డులు బ్రేక్​..

Ind Vs Wi 3rd T20 : తిలక్ హాఫ్ సెంచరీ అడ్డుకున్న హార్దిక్ పాండ్య!.. ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.