ETV Bharat / sports

యువరాజ్ సింగ్​ ఫ్యామిలీకి బెదిరింపులు.. రూ.40 లక్షలు డిమాండ్​.. 'ఆమె' అరెస్ట్​

author img

By

Published : Jul 26, 2023, 7:48 AM IST

Updated : Jul 29, 2023, 8:48 AM IST

యూవీ ఫ్యామీలీకి బెదిరింపులు ఆమె అరెస్ట్
Yuvaraj singh family case

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ ఫ్యామిలీని బురిడి కొట్టించాలని పథకం వేసి పోలీసులకు దొరికిపోయింది ఓ మహిళ. ప్రస్తుతం అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..

Yuvraj Singh s mother Shabnam Singh : ఓ మహిళ.. టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ ఫ్యామిలీని బురిడి కొట్టించాలని పథకం వేసి దొరికిపోయింది. యూవీ కుటుంబాన్ని ఓ తప్పుడు కేసులో ఇరిక్కించేందుకు ప్రయత్నించింది. అలాగే యూవీ తల్లిని, కుటుంబాన్ని బెదిరించి రూ.40 లక్షలు వసూలు చేసేందుకు విఫలయత్నం అయింది. ఫలితంగా జైలులో ఊసులు లెక్కపెడుతోంది.

అసలేం జరిగిందంటే.. యువరాజ్ సింగ్ సోదరుడు జోరావర్ సింగ్​ చాలా ఏళ్ల నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్ తో చాలా ఇబ్బంది పడుతున్నాడు దీంతో యూవీ తల్లి షబ్నామ్​ సింగ్​.. జోరావర్​ కోసం 2022లో హేమా కౌషిక్​ అనే మహిళను కేర్​ టేకర్​గా నియమించుకుంది. అలా పనిలో చేరిన హేమా కౌషిక్​.. కొంత కాలం బాగానే పనిచేసింది. అయితే ఆ తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక.. యువీ తల్లి షబ్నాం సింగ్ ఉద్యోగంలో నుంచి ఆమెను తీసేసింది. కానీ అక్కడితో హేమా ఉరుకోలేదు. తనను అర్థాంతరంగా ఉద్యోగంలో నుంచి తీసేసిన యూవీ ఫ్యామిలీపై పగ పెంచుకుంది. తనకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది.

ఈ క్రమంలోనే కొంత కాలం తర్వాత నుంచి వాట్సప్​ మెసేజ్​ల ద్వారా యూవీ కుటుంబాన్ని బ్లాక్​ మెయిల్​ చేయడం కూడా ప్రారంభించింది. తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ, కుటుంబ పరువును దెబ్బతీస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. అలా చేయకుండా ఉండాలంటే రూ.40లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్​ చేసింది. ఇందులో భాగంగానే మొదట రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో యూవీ ఫ్యామిలీ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. కానీ చివరి నిమిషంలో పోలీసులకు జరిగిన విషయాన్ని అంతా తెలిపారు.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. 20 రోజుల పాటు గాలించి.. ఆమె రూ.5లక్షల డబ్బును అందుకునే సమయంలో రెడ్​ హ్యాెండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి :

ప్రపంచకప్ అద్భుతానికి 15 ఏళ్లు.. అవమానాలను ఎదుర్కొని.. విశ్వవిజేతగా నిలిచి

యూవీ ఆడిన ఐదు బెస్ట్​ ఇన్నింగ్స్​ ఇవే

Last Updated :Jul 29, 2023, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.