తెలంగాణ

telangana

'ఒకే జట్టును పదే పదే ఆడించాలనడం తగదు'.. టీమ్ సెలక్షన్​పై ద్రవిడ్​ స్పందన

By

Published : Oct 2, 2022, 6:52 PM IST

Team India head coach Rahul Dravid
Team India head coach Rahul Dravid

జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలపై టీమ్​ ఇండియా హెడ్​ కోచ్​ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. జట్టుకు ఏం కావాలో తమకు బాగా తెలుసు అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జట్టు పరిస్థితిపై ఆసక్తికర కామెంట్లు చేశాడు.

భారత క్రికెట్ జట్టు ఎంపిక విషయంలో వస్తున్న విమర్శలపై జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ఒకే జట్టును పదే పదే ఆడించడం తగదని చెప్పాడు. ఆటగాళ్లకు గాయాలు కావడం కూడా ప్లేయర్లను మార్చడానికి కారణం అని తెలిపాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్​ కప్​నకు అయితే గత ఏడాది​ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా 29 మంది ఆటగాళ్లను మార్చి ప్రయత్నించారు. రోహిత్ శర్మను, కేఎల్​ రాహుల్​ను ఓపెనర్లుగా ప్రకటించడానికి ముందు.. 10 మంది ఓపెనర్లను ప్రయత్నించి చూశారు.

ఈ నేపథ్యంలోనే.. జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలపై.. ద్రవిడ్ స్పందించారు. జట్టు ఎంపికపై తీసుకున్న నిర్ణయాలను కొందరు విమర్శిస్తూనే ఉంటారని అన్నారు. 2022 ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్​లో జట్టులో ఆడివ వారిని కాకుండా ఫ్యాన్స్​ వేరే కోరుకున్నారని చెప్పాడు.

"అదే 11 మందితో కూడిన జట్టును పదే పదే ఆడించడం తగదు. ప్రజలు కావాలనుకున్న ప్లేయర్ల మార్పులు, ప్రయోగాలు కొన్ని సార్లు మీపై ఒత్తిడి తీసుకువస్తాయి. మీకు పిచ్​ గురించి తెలియదు. అది ఎలా ఉంటుందో తెలియదు. బుమ్రా లాస్ట్​ మ్యాచ్​ ఆడలేదు. అది మేము ప్రయోగం చేయడం వల్ల కాదు.. అతడికి గాయం అయింది కాబట్టి. అయితే 2022లో జులైలో దక్షిణాఫ్రికాతో ఆడిన 5 మ్యాచ్​ల సిరీస్​లో.. అన్ని మ్యాచ్​ల్లో వాళ్లనే ఆడించాం. ఎవరినీ మార్చలేదు. అప్పుడు అన్ని మ్యాచ్​ల్లో వాళ్లనే ఎందుకు ఆడించారు? ఎందుకు మార్చలేదు? అని ప్రజలే ప్రశ్నించారు. మేం ఏం చేసినా ప్రజల రియాక్షన్ ఇలాగే ఉంటోంది" అని చెప్పాడు.

దక్షిణాఫ్రికాతో సిరీస్​లో మొదటి మ్యాచ్​ గెలిచి ఉత్సాహం మీద ఉన్న టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్​ కూడా గెలిచి సిరీస్​ కైవసం చేసుకునేందుకు పట్టుదలతో ఉంది.

ఇవీ చదవండి:ఆసక్తిగా భారత్-పాక్ మ్యాచ్​ ప్రోమో.. మీరు చూశారా?

స్టేడియంలో 'డెత్ మ్యాచ్'.. ​ఫ్యాన్స్​ మధ్య గొడవకు 174 మంది బలి

ABOUT THE AUTHOR

...view details