తెలంగాణ

telangana

అఫ్రిది.. ఏంటీ మార్పు.. నువ్వేనా ఇలా చేసింది?

By

Published : Jul 10, 2022, 2:36 PM IST

Shahid Afridi praises teamindia: ఎప్పుడూ భారత్‌ క్రికెట్‌పై విమర్శలు చేసే పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్ అఫ్రిది ఈ సారి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. టీమ్​ఇండియాపై ప్రశంసలు కురిపించాడు.

shahid afridi
షాహిద్ అఫ్రిది

Shahid Afridi praises teamindia: ఎప్పుడూ భారత్‌ క్రికెట్‌పై సామాజిక మాధ్యమాల్లో అక్కసు వెళ్లబోసుకొనే పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్ అఫ్రిది.. ఈ సారి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమ్​ఇండియాపై ప్రశంసలు కురిపించాడు. ఆసీస్‌ వేదికగా మరో మూడు నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను సాధించే అవకాశం ఉన్న జట్లలో టీమ్‌ఇండియా ఒకటని అఫ్రిది పేర్కొన్నాడు.

"ఇంగ్లాండ్‌పై భారత్‌ అద్భుతంగా ఆడింది. సిరీస్‌ను దక్కించుకునేందుకు అన్ని అర్హతలు టీమ్‌ఇండియాకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బౌలింగ్‌ ప్రదర్శన సూపర్. అందుకే చెబుతున్నా.. ఆసీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ ఫేవరేట్స్‌లో భారత్‌ తప్పకుండా ఉంటుంది" అని షాహిద్‌ అప్రిది పోస్టు చేశాడు. ఐసీసీ షేర్‌ చేసిన ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ ఈ మేరకు కామెంట్‌ ఇవ్వడం విశేషం. ఈ ట్వీట్​ చూసిన నెటిజన్లు.. 'షాహిద్​ ఏంటి నీలో ఇంత మార్పు', 'ఏమైంది నీకు టీమ్​ఇండియాను నువ్వు ప్రశంసించడమా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో తలపడ్డాయి. అయితే తొలిసారి ఐసీసీ ఈవెంట్లలో టీమ్‌ఇండియాపై పాక్‌ విజయం సాధించి చరిత్ర తిరగరాసింది. ఈ వరల్డ్‌ కప్‌లో భారత్‌ గ్రూప్‌ స్టేజ్‌లో ఇంటిముఖం పట్టగా.. పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరుకుని ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది. కాగా, ప్రపంచకప్​లో భాగంగా జరగబోయే టీమ్​ఇండియా-పాకిస్థాన్​ మధ్య జరగబోయే మ్యాచ్​ టికెట్లు దాదాపు అమ్ముడుపోయాయని తెలిసింది.

ఇదీ చూడండి:IND VS ENG: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్​.. బట్లర్​ సూపర్ క్యాచ్​

ABOUT THE AUTHOR

...view details