తెలంగాణ

telangana

టీమ్‌ఇండియాకు అలాంటోడు అవసరం: సచిన్‌

By

Published : Oct 18, 2022, 5:29 PM IST

పొట్టి ప్రపంచకప్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్‌.. టీమ్​ఇండియాకు సలహాలు ఇచ్చాడు. జట్టుకు ఎలాంటి ఆటగాడు అవసరమో చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే..

Sachin tendulkar about teamindia
టీమ్​ఇండియాకు సచిన్ తెందుల్కర్​ సలహా

టీ20లో ప్రపంచకప్​లో టీమ్‌ఇండియా అనుసరించాల్సిన వ్యూహాలపై దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియా తుది జట్టులో ఒక లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

"జట్టులో లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ ఉంటే అది కచ్చితంగా అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లకు అందుకు అనుగుణంగా కుదురుకోవాల్సి ఉంటుంది. తరచూ స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం వల్ల బౌలర్లను ఇరుకున పెట్టొచ్చు" అని వివరించాడు. జట్టులో టాప్‌ 3 స్థానాల గురించి మాట్లాడుతూ.. కేవలం ముగ్గురిపైనే ఆధారపడి ముందుకు వెళ్లకూడదని తెలిపాడు. ఎవరు ఎందులో బాగా రాణిస్తారో తెలుసుకుని వారిని ఆ స్థానంలో పంపాలని, అదే సమయంలో ప్రత్యర్థి బలాలను అంచనా వేయాలని ఈ మాజీ కెప్టెన్‌ పేర్కొన్నాడు.

కాగా, ప్రస్తుతం టీమ్‌ఇండియాలో ఆరుగురు రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్లు ఉన్నారు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచుల్లో నిరూపించుకోలేకపోయిన లెఫ్ట్‌ హ్యాండ్‌ర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ తుది జట్టులో ఉంటాడా లేదా అనేది సందేహమే. అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతుండగా.. దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా ఆడనున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్​లో భారత్​ తన తొలి మ్యాచ్​ను 23న పాకిస్థాన్​తో ఆడనుంది.

ఇదీ చూడండి:పాక్​ పర్యటనకు టీమ్​ఇండియా.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

ABOUT THE AUTHOR

...view details