తెలంగాణ

telangana

'సచిన్​ కోసం రెండుసార్లు 500 కి.మీ సైకిల్​ మీద వెళ్లా.. కానీ..'

By

Published : Sep 29, 2022, 4:08 PM IST

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​కు వీరాభిమానైన సుధీర్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సచిన్​ ఆడే ప్రతి మ్యాచ్​లో పాల్గొని అతడు సందడి చేశాడు. అసలు అతడు మాస్టర్​​కు వీరాభిమానిగా ఎలా మారాడు? ఎప్పుడు తొలిసారి కలిశాడు? సైకిల్​పై 500 కి.మీ ప్రయాణించి సచిన్​ చూసేందుకు వెళ్లిన ప్రయత్నం ఫలించిందా? వంటి విశేషాలను సుధీర్​.. 'ఈటీవీ భారత్'కు ప్రత్యేకంగా చెప్పాడు.

sachin tendulkar die hard fan sudheer kumar  chowdary special interview with etv bharat
sachin tendulkar die hard fan sudheer kumar chowdary special interview with etv bharat

Sachin Die Hard Fan Sudheer: మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ వీరాభిమాని సుధీర్​ కుమార్​ చౌదరి అంటే బహుశా తెలియని టీమ్​ఇండియా అభిమానులు ఉండకపోవచ్చు. సచిన్​ రిటైర్మెంట్ వరకు భారత్​ క్రికెట్​ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ సుధీర్​ స్టాండ్స్​లో​ సందడి చేసేవాడు. విదేశాలకు కూడా వెళ్లి సచిన్​ ఆడిన మ్యాచ్​లను చూసేవాడు. కొన్ని సందర్భాల్లో బీసీసీఐ ప్రత్యేక రాయితీ కల్పించి మరీ విదేశాల్లో జరిగే మ్యాచ్​లు చూడ్డానికి సుధీర్​ను పంపేది. అయితే సచిన్‌ సైతం సుధీర్‌కు చాలా మర్యాద ఇచ్చేవాడు.

ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​లో భాగంగా భారత లెజెండ్స్​ జట్టుకు సచిన్​ సారథిగా వ్యవహరిస్తున్నాడు. 49 ఏళ్ల వయసులోనూ బ్యాట్‌తో మైదానంలో ఆనాటి మెరుపులు మెరిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే సెమీ ఫైనల్స్​కు చేరుకున్న భారత లెజెండ్స్​ జట్టు.. గురువారం ఛత్తీస్​గఢ్​లోని​ షహీద్​ వీర్​ నారాయణ్​ సింగ్​ స్టేడియంలో ఆస్ట్రేలియా లెజెండ్స్​తో తలపడనుంది. దీంతో సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి మ్యాచ్​ చూడటానికి రాయ్‌పుర్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడు 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

ఈటీవీ భారత్​: మొదటగా సచిన్​పై అంత అభిమానం మీకు ఎలా కలిగింది?
సుధీర్​ కుమార్​ చౌదరి: కాలేజీ రోజుల్లో ఒక జర్నలిస్ట్ నాకు సచిన్​ గురించి చెప్పాడు. అతడ్ని కలవమని కూడా సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి సచిన్​పై అభిమానం పెరుగుతూ వచ్చింది.

ఈటీవీ భారత్: సచిన్​కు వీరాభిమానిగా ఎలా మారారు?
సుధీర్ కుమార్: 2001 జనవరి 19న భారత్​ జట్టు ఆడిన మ్యాచ్​ను తొలిసారిగా చూశాను. ఆ తర్వాత అదే నెలలో కాన్పూర్​లో జరిగిన మరో మ్యాచ్​ వీక్షించాను. అదే ఏడాదిలో జరిగిన భారత్​-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్​కు కూడా వెళ్లాను. అలా నా విద్యార్థి జీవితంలో మూడు మ్యాచులు చూశాను. అలా అప్పటి నుంచి సచిన్​గా వీరాభిమానిగా మారిపోయాను.

ఈటీవీ భారత్​: మాస్టర్​ను కలవడానికి తొలిసారి ఎప్పుడు ప్రయత్నించారు?
సుధీర్​: 2002లో నేను సచిన్​ను కలవడానికి సుమారు 500 కి.మీ.. సైకిల్‌పై బిహార్​లోని ముజఫర్​పుర్​ నుంచి జంషెద్​పుర్​కు రెండు సార్లు వెళ్లాను. కానీ ఆ సమయంలో మాస్టర్​ అనారోగ్యం పాలవ్వడం వల్ల కలవలేకపోయాను.

ఈటీవీ భారత్​: సచిన్​ను మొదటిసారి ఎప్పుడు కలిశారు?
సుధీర్​: సచిన్​ను మొదటిసారి ముంబయిలోనే కలిశాను. అతడు ఆడిన ప్రతి మ్యాచ్‌ చూశాను.. తొమ్మిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్​కు సచిన్​ వీడ్కోలు పలికాడు. కానీ నేను ఇప్పటికీ భారత జట్టుకు పూర్తి మద్దతు ఇస్తున్నాను. అయితే సచిన్ ఇప్పుడు రోడ్ సేఫ్టీ సిరీస్​ ద్వారా సెకండ్​ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. దీంతో ఇప్పుడు మరోసారి స్టేడియానికి వెళ్లి అతడికి మద్దతు తెలిపే అవకాశం నాకు లభించింది. అందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈటీవీ భారత్​: టీమ్​ఇండియా ఆడిన మ్యాచులు విదేశాల్లో ఎక్కడైనా చూశారా?
సుధీర్: నేను భారత్​లోనే కాకుండా పాకిస్థాన్​.. లాహోర్​కు వెళ్లి కూడా దాయాది జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ను చూశాను. ఇంగ్లండ్​, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్​ దేశాలకు కూడా వెళ్లి మరీ భారత్​ క్రికెట్ జట్టుకు మద్దతు తెలిపాను.
వీటితో పాటు అతడు చెప్పిన మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో చూడండి.

సచిన్​ తెందూల్కర్​ వీరాభిమాని సుధీర్​ కుమార్​తో 'ఈటీవీ భారత్​' స్పెషల్​ ఇంటర్వ్యూ

ఇవీ చదవండి:ఏడేళ్ల తర్వాత క్రీడా సంబరం.. పోటీ పడనున్న అథ్లెట్లు!

'రొనాల్డో, మెస్సి.. ఇప్పుడు సునీల్‌'.. ఛెత్రిపై ఫిఫా వెబ్​ సిరీస్​

ABOUT THE AUTHOR

...view details