తెలంగాణ

telangana

NZ vs PAK: పాకిస్థాన్ క్రికెట్​ జట్టుకు దెబ్బ మీద దెబ్బ!

By

Published : Sep 23, 2021, 11:28 AM IST

Updated : Sep 23, 2021, 11:49 AM IST

న్యూజిలాండ్​ పర్యటన రద్దుతో పాకిస్థాన్​పై (NZ vs PAK) తీవ్ర ప్రభావం పడింది. ఇతర జట్లపైనా ఆ ప్రభావం ఉంటుందని తీవ్ర అసహనంతో ఉన్న ఆ జట్టుకు.. కివీస్​ పర్యటన కోసం చేసిన ఏర్పాట్ల వ్యయం భారంగా మారింది. ఆతిథ్య జట్టుకు కోసం మోహరించిన భద్రతా బలగాల బిర్యానీ (PCB Biryani Bill) కోసమే భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

New Zealand vs Pakistan
న్యూజిలాండ్ మ్యాచ్

న్యూజిలాండ్ జట్టు తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవడం వల్ల పాకిస్థాన్​పై (NZ vs PAK) కోలుకోలేని దెబ్బ పడింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత 3 వన్డేలు, 5 టీ20ల కోసం కివీస్​.. పాక్​ గడ్డపై అడుగుపెట్టింది. కానీ ఒక్క మ్యాచ్​ కూడా ఆడకుండానే వెనుదిరిగింది (New Zealand Tour of Pakistan Abandoned). భద్రతా కారణాల రీత్యా పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.

ఈ సిరీస్​కు (Pakistan vs New Zealand) ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అనేక ఏర్పాట్లు చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. కానీ, కివీస్​ చర్యతో తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇతర జట్లపైనా దీని ప్రభావం ఉంటుందని, న్యూజిలాండ్​​పై ప్రతీకార చర్యకు సిద్ధంగా ఉండాలని పాక్ మాజీ క్రికెటర్లు ఆగ్రహంవ్యక్తం చేశారు. అయితే కివీస్ పర్యటన రద్దుతో ఆర్థికంగానూ పీసీబీకి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

బిర్యానీకే అంత!

ఇస్లామాబాద్​, రావల్పిండి​లో న్యూజిలాండ్​ భద్రత కోసం ఆర్మీ సహా ఐదుగురు ఎస్​పీలు, 550 మంది ఎస్​ఎస్​పీలను మోహరించింది పాకిస్థాన్. వారికి రోజుకు రెండు సార్లు బిర్యానీ అందించింది. దీంతో కేవలం ఆహార ఖర్చులకే (PCB Biryani Bill) ఏకంగా రూ. 27లక్షలు చెల్లించాల్సి వచ్చినట్లు సమాచారం.

టీ20ల్లో ఎలా తలపడతారో?

ప్రస్తుతం ఇరు జట్లు వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) కోసం సన్నద్ధమవుతున్నాయి. 2009లో పాకిస్థాన్​ ఇదివరకే ఓ సారి టైటిల్​ నెగ్గగా, కివీస్​కు టీ20 కప్​ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ టోర్నీలో ఇరు జట్లు మధ్య పోటీ ఎలా ఉంటుందా అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇవీ చూడండి:

Last Updated :Sep 23, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details