Allu arjun pushpa movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను తెగ అలరిస్తున్నాయి. ముఖ్యంగా 'తగ్గేదే లే' అన్న డైలాగ్‌ను ఫ్యాన్స్, సినీప్రియులు తమదైన స్టైల్లో రీల్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ డైలాగ్‌ను టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా తనదైన స్టైల్లో చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు. మాసిన గడ్డంతో 'పుష్ప' లుక్‌లో కనిపిస్తూ .. 'పుష్ప.. పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదే లే' అంటూ సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విపరీతంగా లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ వీడియోపై అల్లుఅర్జున్ కూడా స్పందించారు. 'సూపర్' అంటూ ఎమోజీని షేర్ చేశారు. కాగా, 'నీ అంత బాగా చేయలేదులే' అంటూ తిరిగి బదులిచ్చాడు జడేజా. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ కూడా 'పుష్ప' సినిమాలోని 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' పాటను అనుకరిస్తూ షేర్ చేసిన వీడియోకు అద్భుత స్పందన వచ్చింది.
ఇవీ చదవండి: